ఇంచార్జ్ ఆర్డిఓ సువర్ణ
విశాలాంధ్ర ధర్మవరం : 18 సంవత్సరాలు నిండిన యువతి యువకులు తప్పనిసరిగా ఓటు హక్కును నమోదు చేసుకోవాలని ఇన్చార్జ్ ఆర్డిఓ సువర్ణ తెలిపారు. ఈ సందర్భంగా వారు ఆర్డిఓ కార్యాలయంలో అసెంబ్లీ నియోజకవర్గంలో గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గం లో మొత్తము 2,48,166 మంది ఓటర్లు ఉన్నారని, ఇందులో పురుషులు 1,22,770 మంది, మహిళలు 1,25,375 మంది ఇతరులు 21 మంది కలరు అని తెలిపారు. అలాగే ఓటర్ జాబితాలో కొత్త నమోదులు మార్పులు తొలగింపులు వంటి అంశాలపై రాజకీయ పార్టీ ప్రతినిధులతో విస్తృతంగా చర్చించడం జరిగిందని తెలిపారు. అనంతరం బిఎల్ఓ లకు ప్రిపరేషన్ అండ్ శిక్షణా తరగతులు జూన్ 5వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ఉంటుందన్నారు. తదుపరి బిఎల్వోలు అన్ని రాజకీయ పార్టీల బి ఎల్ ఏ లు ఇంటింటికి జూన్ 15వ తేదీ నుండి జూలై 14 వ తేదీ వరకు వెళ్లాలని తెలిపారు. ముసాయిదా ఓటర్ల జాబితాను జూలై 21వ తేదీన, క్లెయిమ్స్ స్వీకరణ జూలై 21వ తేదీ నుంచి ఆగస్టు 20వ తేదీ వరకు స్వీకరించబడుతుందని తెలిపారు. క్లెయిమ్స్ డిస్పోసల్స్ జులై 21వ తేదీ నుండి సెప్టెంబర్ 18 వ తేదీ వరకు ఉంటుందన్నారు. తదుపరి తుది ఓటర్ల జాబితా సెప్టెంబర్ 22వ తేదీన ప్రకటిస్తామని తెలిపారు. అనంతరం రాజకీయ పార్టీ ప్రతినిధుల అనుమానాలను కూడా వారు నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో డివిజనల్ పరిపాలన అధికారి ఖతిజున్ కుప్రా, తాసిల్దార్ సురేష్ బాబు, ఎన్నికల సీనియర్ సహాయకులు రాఘవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


