విశాలాంధ్ర ధర్మవరం; పేదల ఆరోగ్యమే మహా లక్ష్యము అని క్యాంపు చైర్మన్ దాసరి వెంకటేశులు ( చిట్టి) తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని తొగట వీధిలో గల శ్రీ శాంత కళా చౌడేశ్వరి దేవి ఆలయ ఆవరణములో శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయ అభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో 123వ ఉచిత వైద్య చికిత్స శిబిరమును వారు నిర్వహించారు. ఈ సందర్భంగా చిట్టి మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా దాతల సహాయ సహకారములతో ఈ చికిత్స శిబిరమును నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ శిబిరంలో 280 మందికి నిష్ణాతులైన డాక్టర్లచే వైద్య చికిత్సలు అందించి, ఒక నెలకు సరిపడా మందులను ఉచితంగా పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ఈ క్యాంపు చివరి దాతలుగా కీర్తిశేషులు ఉక్కిశిల చౌడమ్మ, కీర్తిశేషులు ఎర్రప్ప జ్ఞాపకార్థం వీరి కుమారులు ఉక్కిశిల దేవకి దేవి, ఉక్కిశిల వారి కుటుంబ సభ్యులు నిర్వహించడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా ఈ వైద్య శిబిరములో నిష్ణాతులైన వైద్యులు వివేక కుళ్లాయప్ప, సతీష్ కుమార్, జై దీపు నేత, విట్టల్, ప్రణయ్, వినయ్ లచే రోగులకు వైద్య చికిత్సలను అందించడంతోపాటు ఆరోగ్యం పట్ల తీసుకోవలసిన జాగ్రత్తలు కూడా వివరించడం జరిగిందని తెలిపారు. అనంతరం శిబిర దాతలను ఆలయ కమిటీ తరఫున ఘనంగా సన్మానించడం జరిగిందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు బంధనాథం వెంకటరమణ, కార్యదర్శి సిరివెళ్ల రాధాకృష్ణ తోపాటు మామిళ్ళ అశ్వత నారాయణ, చందా జయ చంద్ర, పెద్దకోట్ల భాస్కర్, పెద్దకోట్ల విజయ్, బండి నాగరాజు, కాచర్ల నారాయణస్వామి, బంధనాదం చిన్నికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
పేదల ఆరోగ్యమే మా లక్ష్యం.. క్యాంపు చైర్మన్ దాసరి వెంకటేశులు (చిట్టి)
- Advertisement -
RELATED ARTICLES


