10 సైనిక కంపెనీలపై ఆంక్షలు
బీజింగ్: అమెరికాకు చైనా పెద్ద షాక్ ఇచ్చింది. అమెరికాకు చెందిన 10 సైనిక సంబంధిత కంపెనీలపై చైనా ఆంక్షలు విధించింది. ఆయా కంపెనీలకు పౌర-మిలిటరీ వినియోగ వస్తువుల ఎగుమతిని నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. వీటిల్లో రేథియాన్, లాక్హీడ్ మార్టిన్ వంటి ప్రముఖ సంస్థలు ఉన్నాయి. అగ్రరాజ్యం ఇటీవల తమ రక్షణ రంగ కాంట్రాక్టుల్లో చైనా టెక్ కంపెనీలను నిషేధించిన నేపథ్యంలో బీజింగ్ ఈ చర్యలు చేపట్టింది. దీంతో పాటు అమెరికాకు చెందిన 46 కంపెనీల నుంచి ఉత్పత్తులు కొనుగోలు చేయకుండా తమ ప్రభుత్వ రంగ సంస్థలను నిరోధించనున్నట్లు చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇతర దేశాలు చైనా నుంచి కొనుగోలు చేసిన వస్తువులను…ఆంక్షలకు గురైన అమెరికా కంపెనీలకు బదిలీ చేయడాన్ని నిషేధిస్తున్నట్లు తెలిపింది. చైనా సైన్యంతో సంబంధాలు ఉన్నాయని ఆరోపిస్తూ…అలీబాబా, బైడూ సహా పలు టెక్ కంపెనీలపై ఈ నెల ఆరంభంలో అమెరికా రక్షణ శాఖ నిషేధం విధించింది. ఇకపై ఆయా కంపెనీలు అగ్రరాజ్య సైనిక కాంట్రాక్టులను పొందలేవని తెలిపింది. ఈ ఏడాది మే నెలలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చైనాలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో భేటీ అయిన ట్రంప్…ఇరు దేశాల మధ్య పరస్పర వాణిజ్య సహకారంపై అంగీకారానికి వచ్చారు. అయితే, నెల తిరక్కుండానే బీజింగ్ కంపెనీలపై అగ్రరాజ్యం ఆంక్షలు విధించడం గమనార్హం. దీంతో బీజింగ్ ప్రతిచర్యలు చేపట్టింది. దెబ్బకు దెబ్బ కొట్టి అమెరికా దురహంకారానికి తలొగ్గేది లేదని నిరూపించుకుంది.
అమెరికాకు చైనా షాక్
- Advertisement -
RELATED ARTICLES


