Homeఅంతర్జాతీయంటెక్ ఉద్యోగులకు ‘ఏఐ’ ముప్పు

టెక్ ఉద్యోగులకు ‘ఏఐ’ ముప్పు

- Advertisement -

ఏడాదిలో ఒరాకిల్ 21వేల మందిని తొలగింపు
నాస్‌విల్లె (యూఎస్):
సాంకేతికత వృద్ధిలో భాగంగా ప్రపంచ వ్యాప్తంగా టెక్ కంపెనీలు అభివృద్ది చెంది సాఫ్ట్‌వేర్ రంగంలో లక్షలాదిమందికి ఉపాధి కలుగుతోంది. యువతకు వారివారి ప్రతిభను బట్టి మంచి అవకాశాలు లభించాయి. అయితే ఇప్పుడు సాంకేతికతలో సాంకేతిక వృద్ధి (ఏఐ) ఇటు ఉద్యోగులకు అటు నిరుద్యోగులకు పెద్ద సవాల్‌గా పరిణమించింది. ఏఐ వృద్ధితో ప్రధానంగా టెక్ కంపెనీల్లోని ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కరువైంది. తాజాగా ప్రముఖ టెక్ సంస్థ ఒరాకిల్ భారీస్థాయిలో ఉద్యోగాలకు కోతపెట్టింది. గత 12 నెలల్లో 21వేల మందిని ఉద్యోగాల నుంచి తొలగించింది. ఈ మేరకు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో కంపెనీ వెల్లడించింది. సంస్థ కార్యకలాపాల్లో కృత్రిమ మేధ (ఏఐ)ను భాగం చేయడంతో ఉద్యోగులను తగ్గించుకోవాల్సి వచ్చిందని, భవిష్యత్తులోనూ ఈ కోతలు కొనసాగుతాయని వెల్లడించింది. ఈ లేఆఫ్‌లతో ఉద్యోగుల సంఖ్య 1,41,000కు పడిపోయింది. 49 వేలమంది అమెరికా ఉద్యోగులు ఉండగా…విదేశాల్లో 92 వేలమంది పనిచేస్తున్నారు. అమెజాన్, మైక్రోసాఫ్ట్, ఒరాకిల్ వంటి క్లౌడ్, డేటా సెంటర్ల దిగ్గజాలు ఏఐ మోడల్స్ వినియోగంపై ఎక్కువగా మొగ్గుచూపుతున్నాయి. డేటా సెంటర్లను నిర్మాణంలో భాగమైన ఈ సంస్థ… తీవ్ర ఆర్థిక ఒత్తిడి ఎదుర్కొంటోంది. నగదు ఆదా, కార్యకలాపాల పునర్నిర్మాణ ప్రక్రియలో భాగంగా ఉద్యోగాలకు కోత పెడుతోంది. దాదాపు అన్ని కంపెనీలు అదే ధోరణితో ఉన్నాయి. దీనితో పేరుమోసిన కంపెనీల్లో పని చేస్తున్న ఉద్యోగుల్లో గుబులు మొదలైంది. ఇక కొత్త అవకాశాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగుల్లోనూ ఆందోళనలు మొదలైనాయి.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు