విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని సాంస్కృతిక మండలి లో నూతన రోటరీ క్లబ్ కమిటీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఇన్స్టిలేషన్ ఆఫీసర్ కేశవరెడ్డి, ఇన్నర్ వీల్ క్లబ్ శ్వేతా రెడ్డి పాల్గొన్నారు. వీరి ఆధ్వర్యంలో నూతన కమిటీ అయిన అధ్యక్షులు బి. జయసింహ, కార్యదర్శి ఎం. చంద్రశేఖర్, కోశాధికారి కె పెద్దారెడ్డి చేత ప్రమాణ స్వీకారోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కేశవరెడ్డి మాట్లాడుతూ ధర్మవరంలో ఇప్పటికే రోటరీ క్లబ్ కు మంచి గుర్తింపు ఉందని, ఆ గుర్తింపును మరింత వికృత పరిచి పేద ప్రజలకు వివిధ సేవలను అందిస్తూ మంచి ప్రతిభ కనబరచాలని తెలిపారు. నూతన కమిటీ వారు మాట్లాడుతూ మా హయాంలో రోటరీ క్లబ్ ని మరింత అభివృద్ధి బాటలో నడుపుతామని వారు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సాంస్కృతిక మండలి అధ్యక్షులు సత్రశాల ప్రసన్నకుమార్, కార్యదర్శి సోలి గాళ్ళవెంకటేశులు, నరేందర్ రెడ్డి-అసిస్టెంట్ గవర్నర్, శ్రీనివాసులు రెడ్డి జోనల్, రత్నశేఖర్ రెడ్డి, నాగభూషణ, చంద్రశేఖర్, కొండయ్య, శివయ్య, సుదర్శన్ గుప్తా, కలవల మురళీధర్, డాక్టర్, నరసింహులు, శంకారపు జయ శ్రీ,, గట్టు హరినాథ్, తదితరులు పాల్గొన్నారు.
రోటరీ క్లబ్ నూతన కమిటీ
- Advertisement -
RELATED ARTICLES


