విశాలాంధ్ర ధర్మవరం;; మాదకద్రవ్యాలపై అవగాహన సదస్సును నిర్వహించడం జరిగిందని ఎక్సైజ్ సీఐ చంద్రమణి తెలిపారు. ఈ సందర్భంగా ప్రపంచ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ధర్మవరం పట్టణంలోని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ చంద్రమణి వన్ టౌన్ సిఐ రెడ్డప్ప ఆధ్వర్యంలో పట్టణంలోని కాలేజ్ సర్కిల్ నందు ఆటో డ్రైవర్లకు , ప్రజలకు ఉద్దేశించి డ్రగ్స్ రహిత ఆంధ్ర ప్రదేశ్ లక్ష్యంగా మాదక ద్రవ్యాల పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ చంద్రమణి మాట్లాడుతూ డ్రగ్స్ జోలికి వెళ్లకండి. మాదక ద్రవ్యాలు కలిగిన, రవాణా చేసిన, స్వీకరించిన మరియు అమ్మిన చట్టపరంగా కేసులు నమోదు చేసి కఠిన శిక్షలు వేయబడుతాయి అని తెలిపారు.దానిలో భాగంగా జైలు జీవితం గడపాల్సి వస్తుంది అని తెలిపారు. వన్ టౌన్ సీఐ రెడ్డప్ప మాట్లాడుతూ విద్యార్థులు డ్రగ్స్ వాడితే తమ యొక్క అపూర్వమైన జీవితాన్ని నాశనం చేసుకోవడం జరుగుతుంది అని తెలిపారు. డ్రగ్స్ వద్దు బ్రో, భవిష్యత్తు ముద్దు అని తెలిపినారు.కాబట్టి మీరు ఈ డ్రగ్స్ వ్యవహారం జోలికి వెళ్లకుండా ఉండాలన్నారు.. ఈ కార్యక్రమం నందు ప్రొహిబిషన్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ నాగరాజు, సివిల్ స్టేషనల ఎస్ఐల వీరేష్ , ఇషాక్ బాషా సిబ్బంది పాల్గొన్నారు.
మాదకద్రవ్యాలపై అవగాహన సదస్సు.. ఎక్సైజ్ సీఐ చంద్రమణి
- Advertisement -
RELATED ARTICLES


