Homeజాతీయంయాచకుల్లేని నగరంగా 'ఇండోర్'

యాచకుల్లేని నగరంగా ‘ఇండోర్’

- Advertisement -

ఇండోర్ (మధ్యప్రదేశ్): దేశంలో పరిశుభ్ర నగరంగా మధ్యప్రదేశ్‌లోని ‘ఇండోర్’ గుర్తింపు పొందింది. పరిశుభ్రతలో ఎనిమిది సార్లు దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిన ఈ నగరం, చెత్త నిర్వహణలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది. ఇప్పుడు మరో ఘనతను సాధించింది. యాచకుల్లేని తొలి నగరంగా ఇండోర్ నిలిచింది. యాచకులు లేని నగరంగా మార్చేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలు ఫలించాయి. యాచకులకు ఉపాధి అవకాశాలు కల్పించి వారు సమాజంలో గౌరవప్రదమైన జీవితం గడిపేలా కార్యక్రమాలు చేపట్టి విజయం సాధించింది. రెండేళ్ల క్రితం ఇండోర్ రోడ్లు, కూడళ్లవద్ద యాచించడాన్ని నిషేధించారు. ఎక్కడైనా యాచకులు కనిపిస్తే మహిళా, శిశు అభివృద్ధిశాఖ ప్రత్యేక బృందం వారిని పునరావాస కేంద్రానికి తరలిస్తుంది. అనంతరం వారి కుటుంబ సభ్యులను గుర్తించడం, వైద్య పరీక్షలు నిర్వహించడం, ఉపాధి అవకాశాలు కల్పించడం వంటి చర్యలు చేపడుతుంది. వీరి పిల్లల్ని గుర్తించి వారి ఆధార్ కార్డులు, ఇతర అవసరమైన పత్రాలు సిద్ధం చేసి ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తుంది. బిక్షాటన చేసే వారిని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. బిక్షాటన చేసి కనిపించిన వారిని గుర్తించి సమాచారం అందించే వారికి రూ.వెయ్యి బహుమతి ప్రకటించింది. దీనితో ప్రభుత్వ యంత్రాంగానికి ఫోన్ కాల్స్ పోటెత్తాయి. యాచకులకు డబ్బులు, ఇతర వస్తువులు ఇచ్చినా…వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. దీనికి స్థానికంగా మంచి స్పందన లబించింది. నాలుగు నెలల్లో 400 వందల మంది యాచకులను పునరావాస కేంద్రాలకు పంపగా…64 మంది చిన్నారులను సంరక్షణ సంస్థకు అప్పగించినట్లు అధికారులు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు