ఆధార్ అప్‌డేషన్ ఫ్రీ, క్రెడిట్ కార్డు నిబంధనల మార్పు
న్యూదిల్లీ: పాస్‌పోర్టు ఫీజులు జులై 1 నుంచి పెరగనున్నాయి. ఎస్‌బీఐ- ఫోన్‌పే, క్రెడిట్ కార్డు రివార్డు పాయింట్లకు సంబంధించి కొత్త నిబంధనలు వస్తున్నాయి. ఆదాయపు పన్ను చెల్లింపుదారులు రిటర్నులు దాఖలు చేయాల్సిన గడువూ ఈ నెలలోనే ముగియనుంది. 36 పేజీలతో కూడిన పాస్‌పోర్ట్ రుసుమును రూ.1500 నుంచి రూ.2,500 పెంచింది. తత్కాల్ ఫీజు రూ.3,500 నుంచి రూ.5 వేలకు సవరించింది. 60 పేజీల పాస్‌పోర్ట్‌కు రూ.2 వేల నుంచి రూ.3,500 పెంచారు. తత్కాల్ ఫీజును రూ.6 వేలుగా నిర్ణయించారు. 18 ఏళ్ల కన్నా తక్కువ వయసున్న దరఖాస్తుదారులకు కొత్త పాస్‌పోర్ట్ రుసుము ప్రస్తుతం రూ.1000 ఉండగా… దీనిని రూ.1750కి చేర్చారు.
ఎస్‌బీఐ క్రెడిట్‌కార్డు యూజర్లకు షాక్…
ఫోన్‌పే-ఎస్‌బీఐ కార్డ్ కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డుల రివార్డు పాయింట్ ప్రోగ్రామ్‌లో ఎస్‌బీఐ కార్డ్ మార్పులు చేసింది. ఫోన్‌పే ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ పర్పుల్, ఫోన్‌పే ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ సెలెక్ట్ బ్లాక్ రివార్డు పాయింట్లకు కొత్త పరిమితులను నిర్దేశించింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కూడా ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్ ప్రోగ్రాములో మార్పులు చేసింది. త్రైమాసికంలో కనీసం రూ.60వేలు ఖర్చు చేసిన వారికే తదుపరి నెల ఉచిత లాంజ్ యాక్సెస్ కల్పించేలా మార్పులు చేసింది. ఈ నిబంధనలు జులై 1 నుంచే అమల్లోకి రానున్నాయి.
6 నెలలు ఆధార్ ఫ్రీ…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ తన మొబైల్ యాప్‌లో ఈ-మెయిల్ అప్‌డేషన్‌పై రుసుములు తొలగించింది. ప్రస్తుతం ఈ-మెయిల్ ఐడీ అప్‌డేషన్ కోసం రూ.75 చొప్ప్పున ఫీజు వసూలు చేస్తుండగా…జులై 1 నుంచి ఆరు నెలల పాటు డిసెంబర్ 31వరకు ఉచితంగా అప్‌డేట్ చేసుకునే సదుపాయాన్ని ఉడాయ్ కల్పిస్తోంది.
పాస్‌పోర్ట్ ఫీజుల బాదుడు
- Advertisement -
RELATED ARTICLES


