Homeజిల్లాలుశ్రీ సత్యసాయిప్రతి బ్యాంకులో సీసీ కెమెరాలు, సెక్యూరిటీ గార్డ్స్ ను ఏర్పాటు చేసుకోవాలి..

ప్రతి బ్యాంకులో సీసీ కెమెరాలు, సెక్యూరిటీ గార్డ్స్ ను ఏర్పాటు చేసుకోవాలి..

- Advertisement -

వన్ టౌన్ సీఐ రెడ్డప్ప

విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని వన్ టౌన్ పరిధిలో గల ప్రతి బ్యాంకులో ఉన్న మేనేజర్లందరూ కూడా తమ తమ బ్యాంకుల్లో సీసీ కెమెరాలు, అదేవిధంగా పట్టణంలో ఏటీఎంలు ఉన్నచోట తప్పనిసరిగా సెక్యూరిటీ గార్డ్స్ ను ఏర్పాటు చేసుకోవాలని వన్ టౌన్ సీఐ రెడ్డప్ప తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వన్టౌన్ పరిధిలోని అన్ని బ్యాంకులకు సంబంధించిన మేనేజర్లకు నోటీసులను పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ మధ్యకాలంలో అధికంగా బ్యాంకుకు సంబంధించిన ఏటీఎం లో నేరాలు అధికంగా జరుగుతున్నందువలన సదరు బ్యాంకు నందు సీసీ కెమెరాలు సెక్యూరిటీ గార్డ్స్ తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని తెలపడం జరిగిందన్నారు. అదేవిధంగా బ్యాంకు నందు నైట్ వాచ్మెన్ కూడా నియమించుకోవాలని తెలపడం జరిగిందన్నారు. ఇందుకు స్పందించిన బ్యాంకు మేనేజర్లు మాట్లాడుతూ తప్పనిసరిగా పై అధికారులకు తెలిపి సమస్యను పరిష్కరించుకుంటామని వారు హామీ ఇచ్చారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు