మూడో ‘సారీ’ మన వారు బ్యాట్లెత్తేశారు
టీ 20 లో భారత్ ఘోర పరాజయం
క్రీడలు: ఇంగ్లాండ్ చేతిలో మూడో టీ20లో భారత్ ఘోర పరాజయం పాలైంది. ఇటీవల టీ 20 వరల్డ్ చాంపియన్ గా నిలిచిన భారత క్రికెట్ జట్టు ఇప్పుడు వరుస ఓటములు మూటగట్టుకుంటుంది. ఇంగ్లాండ్‌లోని నాటింగ్హామ్ వేదికగా మంగళవారం జరిగిన మూడో టీ 20 మ్యాచ్‌లో చిత్తుగా ఓడిపోయింది. 125 పరుగుల భారీ తేడాతో ఓటమి చవిచూసింది. ఇంగ్లాండ్ ఉంచిన 202 పరుగుల లక్ష్య ఛేదనలో మానవాళ్లు బ్యాటింగ్‌లో చేతులెత్తేసి చతికిల పడ్డారు. బైలింగ్, ఫీల్డింగ్, బ్యాటింగ్ మూడు విభాగాల్లోనూ మన వాళ్లు పేలవమైన ఆటతీరును ప్రదర్శించారు. దీంతో 5 టీ 20 ల సిరీస్‌లో 2`0తో ఇంగ్లాండ్ ముందుకెళ్లింది. భారత జట్టు ఓటమి పాలవడమే కాకుండా పలు చెత్త రికార్డులు నెత్తిన పెట్టుకుంది. గంభీర్ శిక్షణ, శ్రేయస్ కెప్టెన్సీపై పలు విమర్శలు వస్తున్నాయి.
పేలవ ప్రదర్శన…చెత్త రికార్డులు…
మూడో టీ 20లో మన వాళ్లు ఏ దశలోనూ నిలకడను ప్రదర్శించలేకపోయారు. బౌలింగ్, పీల్డింగ్‌లో విఫలమై ఎక్కువ పరుగులు సమర్పించుకున్నారు. 202 పరుగుల లక్ష్య సాధనకు బరిలోకి దిగిన భారత జట్టు 11.4 ఓవర్లకే 76 పరుగులు మాత్రమే చేసి బ్యాటర్లు పెవిలియన్కు చేరుకున్నారు. భారత్ టీ20 ఫార్మాట్‌లో ఇంత తక్కువ ఓవర్లకు ఎప్పుడూ ఆలౌట్ కాలేదు. 2015లో 17.2 ఓవర్లకు కటక్‌లో దక్షిణాఫ్రికాపై, 2008లో మెల్బోర్నలో ఆస్రేట్లియాపై 17.3 ఓవర్లకు ఆలౌటయ్యారు. ఇప్పుడు ఆ రికార్డులను శ్రేయస్ నేతృత్వంలోని టీమ్ఇండియా తుడిపేసింది. భారత్ టీ20 ఫార్మాట్‌లో తొలి ఆరు ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోవడం ఇదే తొలిసారి. ఈ మ్యాచ్‌లో 52/5 స్కోర్‌తో నిలిచింది. 76 పరుగులు చేసిన భారత్ రెండో అత్యల్ప స్కోర్‌కు ఆలౌట్ అయింది. ఇంగ్లాండ్‌లో పర్యటించిన విదేశీ టీ20 జట్లలో భారత్ సాధించిన 76 పరుగులే అత్యల్ప స్కోరుగా నమోదు అయింది. భారత టీ20 చరిత్రలో తాజాగా 125 పరుగుల తేడాతో ఓటమే అతిపెద్దది. టీ 20 ప్రపంచకప్ సాధించిన తర్వాత భారత్ జట్టు విజయాలకు తహతహలాడుతోంది. వరుసగా ఐదు మ్యాచ్ల్లో భారత్ గెలవలేదు. నాలుగు మ్యాచ్‌లు ఓడిపోగా…ఒక మ్యాచ్ రద్దైంది.
వరుస ఓటమిలు…చెత్త రికార్డులు
- Advertisement -
RELATED ARTICLES


