సెన్సార్ పూర్తి… ‘ఏ’ సర్టిఫికెట్ జరీ సోషల్ మీడియాలో ప్రచారం
సినిమా: తమిళ అగ్ర నటుడు, సీఎం విజయ్ సినిమా ‘జన నాయగన్’ విడుదల ఎపðడా అని ఎదురు చూస్తున్న అభిమానులకు సోషల్ మీడియాలో రోజుకో వార్త వినిపిస్తుంది. విజయ్ నటించిన చివరి చిత్రం కావడంతో అభిమానుల్లో మొదటి నుంచి ఆతృత కనిపిస్తోంది. తమ అభిమాన నటుడు, నాయకుడు సినిమా చూడాలని ఉవ్విళ్లూరుతున్నారు అభిమానులు. ఈ సినిమాపై తాజాగా ఈ చిత్రం సెన్సార్ పూర్తయిందని, ‘ఏ’ సర్టిఫికెట్ జారీ అయ్యిందని, ఈ నెల 23న విడుదల కానుందనే వార్తలు జోరుగా ప్రచారమయ్యాయి. కట్స్‌తో కూడిన ఓ సర్టిఫికెట్ కూడా నెట్టింట వైరల్ అయింది. దీనిపై నిర్మాణ సంస్థ ఎట్టకేలకు స్పందించింది.
అదంతా ఫేక్: నిర్మాణ సంస్థ
సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు చాలా వరకు ఫేక్ అని నిర్మాణ సంస్థ కేవీఎన్ కొట్టిపారేసింది. ‘సోషల్ మీడియాలో షేర్ అవుతోన్న సెన్సార్ రిపోర్ట్ ఫేక్. బోర్డు ఈ చిత్రం చూసి మాకు కొన్ని సవరణలు సూచించింది. మేం ఆ మార్పులు చేస్తున్నాం. అవి పూర్తయ్యాక తిరిగి సెన్సార్‌కు పంపుతాం. త్వరలోనే ఈ పనులు పూర్తయి…సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామనే నమ్మకం ఉంది’ అని నిర్మాణ సంస్థ కేవీఎన్ తెలిపింది. హెచ్ వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో విజయ్‌కు జోడీగా పూజా హెగ్డే నటించారు.
త్వరలో ‘జన నాయగన్’ విడుదల!
- Advertisement -
RELATED ARTICLES


