ఖమేనీ అంత్యక్రియలు జరుపుతున్న వేళ అగ్ర రాజ్యం క్షిపణి ప్రయోగాలు
అమెరికా బేస్ ల పై ఇరాన్ ప్రతీకార దాడులు
తెహ్రాన్: పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ మేఘాలు గర్జించాయి. అమెరికా-ఇరాన్ పరస్పర దాడులతో గల్ఫ్ దేశాల్లో సైరన్ల మోత మోగుతోంది. అగ్రరాజ్య దాడులపై తీవ్రంగా మండిపడ్డ ఇరాన్… ప్రతీకార దాడులు మొదలుపెట్టింది. బహ్రెయిన్, కువైట్‌లో అమెరికాకు చెందిన 85 సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణులు ప్రయోగించింది. హోర్మూజ్ జలసంధి లో వాణిజ్య నౌకలపై దాడులకు ప్రతిస్పందనగా… ఇరాన్ వైమానిక రక్షణ వ్యవస్థలు, తీరప్రాంత నిఘా వ్యవస్థలపై అమెరికా వైమానిక దాడులు చేసింది. దీనిపై ఐఆర్జీసీ తీవ్రంగా స్పందించింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని అగ్రరాజ్యం ఉల్లంఘించిందని ఆరోపించిందని, అందుకే ఈ తాజా ఆపరేషన్ చేపట్టినట్లు వెల్లడించింది. బహ్రెయిన్‌లోని యూఎస్ ఫిఫ్త ఫ్లీట్, కువైట్‌లోని అలీ అల్ సలేమ్ ఎయిర్ బేస్ సహా అగ్రరాజ్యానికి చెందిన 85 కీలక మిలిటరీ స్థావరాలను టార్గెట్ చేసినట్లు పేర్కొంది. బుషెహర్‌లో అమెరికా అత్యాధునిక డ్రోన్ ఎంక్యూ-9ను కూల్చినట్లు ఐఆర్జీసీ వెల్లడించింది.
బెదిరింపులు సాగవు: ఇరాన్
ఒకవైపు ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు జరుగుతోన్న వేళ ఈ ఉద్రిక్తతలు చోటుచేసుకోవడం గమనార్హం. దీనిపై ఐఆర్జీసీ స్పందిస్తూ…తమ చారిత్రక కార్యక్రమాన్ని మరుగున పెట్టేందుకు వాషింగ్టన్ ప్రయత్నిస్తోందని దుయ్యబట్టింది. తాజా దాడులపై ఇరాన్ స్పీకర్ ఘాలిబఫ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘వేధింపులు, బెదిరింపుల శకం ముగిసింది. వాటికి మేం తలొగ్గబోం. అమెరికా తీవ్ర ఉల్లంఘనలకు పాల్పడుతోంది. ఆ దేశం ఎంత ఒత్తిడి చేసినా… ఇరాన్ లొంగిపోదు’ అని పోస్ట్‌లో పేర్కొన్నారు.
పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు
- Advertisement -
RELATED ARTICLES


