ఇరాన్‌కు 24 గంటల గడువు…హోర్మూజ్‌పై అమెరికా హెచ్చరిక
వాషింగ్టన్: పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో హోర్మూజ్ కేంద్రంగా దాడులు మరింత ఉదృతమయ్యాయి. జలసంధిపై ఆధిపత్యానికి అమెరికా తెగబడుతోంది. ఎట్టిపరిస్థితుల్లోనూ అక్కడ మీ ఆటలు సాగవన్నట్లు ఇరాన్ ప్రతిఘటిస్తోంది. ప్రతీకార దాడులును చేస్తోంది. ఈ నేపథ్యంలో…హోర్మూజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై జరుగుతున్న దాడులను వెంటనే నిలిపివేయాలని, లేకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఇరాన్‌ను అమెరికా హెచ్చరించినట్టు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. హోర్మూజ్ జలసంధి అంతర్జాతీయ నౌకాయానానికి పూర్తిగా తెరిచి ఉంటుందని, వాణిజ్య నౌకలపై ఎటువంటి దాడులూ జరగవని 24 గంటల్లోగా ఇరాన్ బహిరంగంగా ప్రకటించాలని వాషింగ్టన్ స్పష్టం చేసినట్టు సమాచారం. లేనిపక్షంలో తీవ్రమైన సైనిక, ఆర్థిక చర్యలు తీసుకుంటామని అమెరికా హెచ్చరించినట్టు తెలుస్తోంది. ఈ హెచ్చరికను మధ్యవర్తుల ద్వారా ఇరాన్‌కు అమెరికా చేరవేసినట్టు సమాచారం. ‘నౌకలపై కాల్పులు ఆపేస్తామని బహిరంగంగా చెప్పాలి. మేము తప్ప చేశామని వారు కనీసం పరోక్షంగానైనా అంగీకరించాలని మేము కోరుకుంటున్నాము. కాల్పులు ఆపేస్తామనేదే రేపు వారి ప్రకటన కావాలి. లేకపోతే వారికి అది మంచి రోజు కాబోదు’ అని అమెరికా అధికారి హెచ్చరించినట్టు తెలుస్తోంది. ఈ ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ ఒమన్‌లో మధ్యవర్తిత్వ చర్చల్లో పాల్గొననున్నారు ఈ సమావేశం అనంతరం ఇరాన్ అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉందని అమెరికా అధికారులు భావిస్తున్నారు. అయితే గడువులోగా స్పష్టమైన హామీ రాకపోతే పరిస్థితి మళ్లీ ఉద్రిక్తంగా మారే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అమెరికా తెగబడుతుందని ఆందోళనలు మొదలయ్యాయి.
సమయం లేదు శత్రువా!
- Advertisement -
RELATED ARTICLES


