Homeఅంతర్జాతీయంవెనెజులాలో మళ్లీ భూ కంపం

వెనెజులాలో మళ్లీ భూ కంపం

- Advertisement -


కారకాస్: వెనెజులాలో మరోసారి భూకంపం సంభవించింది. కారకాస్‌లో శుక్రవారం 3.0 తీవ్రతతో భూకంపం సంభవించడంతో స్థానికంగా ఉన్న భవనాలను ఖాళీ చేయించి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. నెల రోజులు కాక ముందే మరోసారి భూమి కంపించడంతో అక్కడ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తీవ్రత తక్కువగానే ఉన్నప్పటికీ ఇది వరకు తగిలిన గాయాలు ఇంకా మానకుండానే మరో విపత్కరం సంభవించడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. మరో వైపు దేశంలో కొనసాగుతోన్న భూకంప సహాయక చర్యల కోసం…యూకే ఆంక్షల కింద విదేశాలలో స్తంభింపజేసిన సుమారు 30 టన్నుల వెనెజులా బంగారాన్ని విడుదల చేయాలని కింగ్ చార్లెస్‌ని కోరినట్లు ఆ దేశ తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ వెల్లడించారు.
గత నెలలో జరిగిన విలయంలో 4 వేలకు పైగా మరణాలు…
కాగా గత నెల 24న సెకన్ల వ్యవధిలో సంభవించిన రెండు భారీ భూకంపాలు పెను విషాదాన్ని మిగిల్చాయి. రిక్టర్ స్కేల్‌పై 7.5, 7.2గా భూకంప తీవ్రత నమోదయింది. ఈ భూ విలయంతో చాలా బహుళ అంతస్తుల భవనాలు, వ్యాపార కేంద్రాలు నేలమట్టం అయ్యాయి. ఈ ప్రళయంలో ఇప్పటివరకు 4 వేలకు పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయినట్లు అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. 16,740 మంది గాయపడినట్లు పేర్కొంది. భవన శిథిలాల కింద వేలాది మంది చిక్కుకున్నారని తెలిపింది. ఇంకా చాలా మంది జాడ తెలియరాలేదు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇంకా అక్కడ శిథిలాల తొలగింపు కొనసాగుతోంది. ఇంతలోనే మరో భూకంపం రావడం అక్కడ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు