Homeఅంతర్జాతీయంమూడు రోజుల వరుస నష్టాలకు ఈరోజు బ్రేక్.. బలపడిన రూపాయి

మూడు రోజుల వరుస నష్టాలకు ఈరోజు బ్రేక్.. బలపడిన రూపాయి

- Advertisement -

అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి మారకం విలువ మూడు రోజుల వరుస నష్టాలకు ఈరోజు బ్రేక్ వేసింది. ఉదయం ట్రేడింగ్‌లో రూపాయి 4 పైసలు బలపడి 96.31 వద్ద ప్రారంభమైంది. గత సెషన్‌లో ఇది 96.35 వద్ద ముగిసిన విషయం తెలిసిందే. అంతర్జాతీయంగా డాలర్ బలహీనపడటంతో రూపాయికి ఈ మాత్రం ఊరట లభించింది. ప్రపంచంలోని ఆరు ప్రధాన కరెన్సీలతో పోల్చే డాలర్ ఇండెక్స్ నెల రోజుల కనిష్ఠ‌ స్థాయికి పడిపోవడం రూపాయికి కలిసొచ్చింది. అమెరికాలో ద్రవ్యోల్బణం అంచనాల కంటే తక్కువగా నమోదు కావడంతో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను వెంటనే పెంచకపోవచ్చనే అంచనాలు పెరిగాయి. దీంతో డాలర్ విలువ తగ్గింది. మార్కెట్ వర్గాల ప్రకారం జులైలో వడ్డీ రేట్ల పెంపు ఉండకపోవచ్చని, కానీ సెప్టెంబర్‌పై ఇంకా అనిశ్చితి కొనసాగుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, ముడి చమురు ధరలు పెరగడం రూపాయి లాభాలకు అడ్డుకట్ట వేసింది. అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రం కావడంతో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 85 డాలర్ల సమీపానికి చేరింది. ఈరోజు ఉదయం బ్రెంట్ క్రూడ్ 1.48% పెరిగి 85.48 డాలర్ల వద్ద, డబ్ల్యూటీఐ క్రూడ్ 1.60% పెరిగి 80 డాలర్ల వద్ద ట్రేడ్ అయ్యాయి.

మరోవైపు ఆసియా ఈక్విటీ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. జపాన్ నిక్కీ 4 శాతానికి పైగా పతనం కాగా, హాంగ్‌కాంగ్, చైనా మార్కెట్లు కూడా నష్టపోయాయి. ఇక, దేశీయంగా బంగారం ధరలు పెరిగాయి. భౌగోళిక ఉద్రిక్తతల వల్ల సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం ధరలు పెరగ్గా, వెండి ధరలు మాత్రం తగ్గుముఖం పట్టాయి.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు