విదేశీయులు కూడా భారత్‌లో భూములు కొనుగోలు చేసుకోవచ్చు
కోల్‌కతా: భూరికార్డులు పౌరసత్వానికి కచ్చితమైన రుజువులు కావని కలకత్తా హైకోర్టు పేర్కొంది. విదేశీయులు కూడా భారత్‌లో భూమి కొనుగోలు చేయొచ్చన్న విషయాన్ని హైకోర్టు ప్రస్తావించింది. భారత్‌లో భూమి కొన్నంత మాత్రాన వారు భరత పౌరులు అయిపోరని తెలిపింది. బంగ్లాదేశ్ నుంచి భారత్‌లోకి అక్రమంగా చొరబడ్డాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న నసీర్ ముల్లా అనే వ్యక్తి కేసులో విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. నసీర్ ముల్లా తరఫు న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ నసీర్ భారత పౌరుడేనని అన్నారు. కేంద్రం మాత్రం ఈ వాదనలను కొట్టి పారేసింది. తాను విదేశీయుడినని నసీర్ స్వయంగా ఒప్పుకున్నాడని తెలిపింది. ఈ నేపథ్యంలో తన పౌరసత్వాన్ని రుజువు చేసుకునేందుకు డాక్యుమెంట్లు చూపాలని న్యాయస్థానం ఆదేశించింది. దీంతో, ససీర్కు చెందిన భూరికార్డులను మాత్రమే అతడి తరఫు లాయర్ సమర్పించారు. దీనిపై కోర్టు స్పందిస్తూ భూరికార్డులు పౌరసత్వానికి రుజవులు కావని స్పష్టం చేసింది.
కాగా, భారత పాస్‌పోర్టులు దేశ పౌరసత్వానికి రుజువు కాదని కేంద్రం గత నెలలోనే పేర్కొన్న విషయం తెలిసిందే. వీటిని విదేశీయులకూ ఇచ్చే అవకాశం సాంకేతికంగా ఉండటంతో పౌరసత్వానికి రుజువుగా పరిగణించలేమని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. 2013లో బాంబే హైకోర్టు ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ పాస్‌పోర్టులను పౌరసత్వానికి కచ్చితమైన రుజువుగా పరిగణించలేమని పేర్కొంది.
భూరికార్డులు పౌరసత్వానికి రుజువులు కావు: కలకత్తా హైకోర్టు
- Advertisement -


