Homeజిల్లాలుశ్రీ సత్యసాయితాళం వేసిన ఇంటికి..పోలీసుల భరోసా

తాళం వేసిన ఇంటికి..పోలీసుల భరోసా

- Advertisement -

ఎల్ హెచ్ ఎం ఎస్ తో నిశ్చింత జీవితం. వన్ టౌన్ సిఐ రెడ్డప్ప
విశాలాంధ్ర ధర్మవరం;;ప్రజల ఆస్తుల భద్రతకు పెద్దపీట వేస్తూ శ్రీ సత్యసాయి జిల్లా పోలీసు శాఖ అమలు చేస్తున్న ఎల్ హెచ్ ఎం ఎస్ కార్యక్రమం ప్రజల నుంచి విశేష ఆదరణ పొందుతోంది. జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ దూరదృష్టితో ప్రారంభమైన ఈ వినూత్న కార్యక్రమాన్ని ధర్మవరం ఒకటవ పట్టణ పరిధిలో సీఐ రెడ్డప్ప తన సిబ్బందితో విజయవంతంగా అమలు చేస్తున్నారు.ఇంటికి తాళం వేసి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ రోజులు బయటకు వెళ్లే కుటుంబాలు పోలీసులకు సమాచారం అందిస్తే, ఆ ఇళ్లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తున్నారు. దీంతో చోరీలు, ఇతర అవాంఛనీయ ఘటనలను నివారించడంతో పాటు ప్రజల్లో భద్రతాభావం మరింత పెరుగుతోంది.సాంకేతికతను వినియోగిస్తూ ప్రజలకు మరింత చేరువయ్యే పోలీసింగ్‌ను అందించాలనే ఎస్పీ సతీష్ కుమార్ సంకల్పానికి ఈ కార్యక్రమం నిదర్శనంగా నిలుస్తోంది. ఆ ఆశయాన్ని క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేస్తూ ధర్మవరం ఒకటవ పట్టణ సీఐ రెడ్డప్ప తన విధి నిర్వహణలో నిబద్ధతను చాటుకుంటున్నారు.ప్రజల రక్షణే లక్ష్యంగా పనిచేస్తున్నామని సిఐ రెడ్డప్ప తెలిపారు.ప్రజలు కూడా తమ ఇళ్ల భద్రత కోసం ఈ సేవలను వినియోగించుకుని పోలీసులతో సహకరించాలని అధికారులు కోరుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు