విశాలాంధ్ర ధర్మవరం; పట్టణంలోని శారదానగర్ కి చెందిన కీ శే జింకా రామచంద్ర గుండెపోటు తో మరణించగా, తన కళ్ళను నేత్రదానం చేసి రెండు కుటుంబాల్లో కొత్త వెలుగును నింపారు. వివరాలకు వెళితే సమాచారాన్ని అందుకున్న విశ్వదీప సేవా సంఘం సభ్యులు నేత్రదానంపై వారి కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించగా వారు నేత్రధానం కి ఒప్పుకోవడం తో జిల్లా అందత్వ నివారణ సంస్థ, అనంతపురం రెడ్ క్రాస్ సొసైటీ డివై కుల్లాయప్ప కంటి రెట్రావైల్ సెంటర్ వారి టెక్నీషన్ జి రాఘవేంద్ర కంటి కార్నియా సేకరించడం జరిగింది . నేత్రదానానికి సహకరించిన దాత భార్య రమాదేవి కుమారుడు హేమంత్ కుమార్తెలు శ్రీలత, మణి కోడలు నాగమణి అల్లుడు సంతోష్, నాగరాజు గారికి సేవా సంఘం వారు కృతజ్ఞతలు తెలియజేసినారు. ఈ కార్యక్రమంలో ఫౌండర్ కోళ్ళమొరం చంద్రశేఖర్ రెడ్డి అధ్యక్షులు గాజుల సురేష్ ఉపాధ్యక్షులు టి చంద్రశేఖర్ రెడ్డి .సెక్రటరీ జూజారు రఘు, చిప్పల రెడ్డెప్ప ,గుద్దిటి ధనుంజయ గుద్దిటి కేశవ విశ్వదీప సేవా సంఘం సభ్యులు పాల్గొన్నారు. నేత్రదానం చేయువారు
9392323605, లేదా9666629841 లేదా9059017583, లేదా8247724335 లేదా
9492323912, లేదా9703126122 సంప్రదించాన్నారు.
నేత్రదానంతో రెండు కుటుంబాల్లో కొత్త వెలుగులు నింపిన నేత్ర దాత జింకా రామచంద్ర
- Advertisement -
RELATED ARTICLES


