Homeజిల్లాలుశ్రీ సత్యసాయిమానవతను చాటుకున్న మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు

మానవతను చాటుకున్న మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు

- Advertisement -

విశాలాంధ్ర ధర్మవరం : పట్టణంలోని మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు మరోసారి తమ మానవతను చాటుకున్నారు. వివరాలకు వెళితే కాయగూరల మార్కెట్ వద్ద గల చర్చి వద్ద ఒక ఆవు దూడ కాలిగిట్టకు తీవ్రమైన గాయమై లేవలేని పరిస్థితిలో ఉంది. ఈ సమాచారాన్ని తెలుసుకున్న మానవతా స్వచ్ఛంద సంస్థ ప్రమోటర్ గ్రూప్ మెంబర్ పళ్లెం జనార్ధన, కోశాధికారి చల్లా చంద్రశేఖర్ అక్కడికి చేరుకొని, ప్రాథమికంగా గాయాన్ని శుభ్రం చేసిన తర్వాత ప్రభుత్వ పశువుల ఆసుపత్రికి ఆటో ద్వారా తీసుకెళ్లి అక్కడ వైద్యుని ద్వారా వైద్య చికిత్సలను అందించారు. తిరిగి తన అమ్మ గోమాత వద్దకు ఆ దూడను చేర్చారు. కానీ ఆ గోమాత (ఆవు) సహాయం చేసిన వారి ఇరువురిని ఎంతో ఆప్యాయంగా దగ్గరికి వెళ్లిన వైనం అందరినీ ఆకట్టుకుంది. దీంతో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ మరోసారి తన మానవతాలు చాటు కొనడంతో ప్రజలు పలువురు సంస్థలు అభినందించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు