విశాలాంధ్ర ధర్మవరం; రెవెన్యూ డివిజన్ పరిధిలోని రామగిరి మండలం పేరూరు ప్రాజెక్టు సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఎమ్మెల్యే పరిటాల సునీత ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉదయం ఎమ్మెల్యేఆసుపత్రికి వెళ్లగానే.. అక్కడున్న వైద్యులు, సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఆసుపత్రిలో ఉన్న సౌకర్యాలు, రోగులకు అందుతున్న చికిత్సలను పరిశీలించారు. ఆసుపత్రితో పాటు పరిసరాల్ని పరిశీలించి.. వైద్యులకు పలు సూచనలు చేశారు. ఆసుపత్రిని పరిశుభ్రంగా ఉంచుకోవాలని.. వైద్యులు సమయానికి రావాలన్నారు. రోగులతో మర్యాదపూర్వకంగా ఉండాలని.. పెద్ద సమస్య ఉంటే తప్ప.. ఇతర హాస్పిటల్స్ కు రెఫర్ చేయవద్దన్నారు. వైద్యులు, సిబ్బంది ఆసుపత్రిలో ఉన్న సమస్యల్ని ఎమ్మెల్యే సునీత దృష్టికి తీసుకెళ్లారు. ఫార్మసీ (మెడిసిన్స్) నిర్వహణ కోసం ప్రత్యేకంగా గది, వైద్యం కోసం వచ్చిన వారికి తగినన్ని బెడ్లు లేకపోవడం, నీటి సమస్యను ఎమ్మెల్యేకి వివరించగా వాటిని పరిష్కరిస్తామన్నారు. అనంతరం కంబదూరు మండలం రాళ్ల అనంతపురం గ్రామానికి చెందిన కుటుంబ శ్రేయోభిలాషి పెద్ద వెంకటేష్ ఇటీవల అనారోగ్యంతో మరణించగా ఎమ్మెల్యే సునీత ఆయన నివాసానికి వెళ్లారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆ తర్వాత వెంకటాపురంలోని తన కార్యాలయానికి వివిధ కారణాలు సమస్యలు నిమిత్తం వచ్చిన వారితో సమావేశామయ్యారు. వారి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని సునీత హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, అధికారు లు పాల్గొన్నారు
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిటాల సునీత ఆకస్మికంగా తనిఖీ
- Advertisement -
RELATED ARTICLES


