Homeసినిమాజాతీయ అవార్డు అందుకున్న ‘కమిటీ కుర్రోళ్ళు’

జాతీయ అవార్డు అందుకున్న ‘కమిటీ కుర్రోళ్ళు’

- Advertisement -

తెలుగు చిత్రాలకు 8 పురస్కారాలు
న్యూదిల్లీ:
72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో తెలుగు చిత్రాలు అవార్డుల పంట పండించాయి. 2024 సంవత్సరానికి గానూ వివిధ కేటగిరీల్లో నాలుగు తెలుగు చిత్రాలకు 8 పురస్కారాలు లభించాయి. ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ‘కమిటీ కుర్రోళ్ళు’ ఎంపికైంది. ఉత్తమ మేకప్ విభాగంలోనూ ఈ సినిమాకి అవార్డు వరించింది. కొత్త నటులతో దర్శకుడు యదు వంశీ రూపొందించి ఈ చిత్రానికి మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మాతగా వ్యవహరించడం విశేషం. బాకాస్ఫీస్‌తో పాటు ఓటీటీలోనూ అదరగొట్టిన ఈ మూవీ ఇప్పుడు ఏకంగా రెండు జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ అవార్డుల్లో జాతీయ సమైక్యత, మతసామరస్యం, అణగారిన వర్గాల సామాజిక అభ్యున్నతికి ఉద్దేశించిన చిత్రంగా వివిధ విభాగాల్లో మెరిసింది.
ఇక నాగ్ అశ్విన్ విజువల్ వండర్ ‘కల్కి 2898 ఏడీ’కి రెండు కేటగిరీల్లో అవార్డులను దక్కించుకుంది. అద్భుతమైన సెట్స్‌, విజువల్స్‌తో అలరించినందుకు ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ అవార్డుతో పాటు, ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా జాతీయ అవార్డును సొంతం చేసుకుంది. ‘ఎంత గొప్పగా ఆడావు అన్నది ముఖ్యం కాదు…ఎప్పుడు ఆపావన్నదే ముఖ్యం, ‘ఒక్క రోజులో ఒక అరగంట నాకు నచ్చినట్టు గడవలేదు. దానికి జీవితాంతం ఏడుస్తూ కూర్చోలేను కదా’ వంటి సంభాషణలతో అలరించిన చిత్రం ‘లకీక్క భాస్కర్’. ì అద్భుతమైన సంభాషణలను రాసి జీవిత సత్యాలెన్నో చెప్పిన దర్శకుడు వెంకీ అట్లూరికి ఉత్తమ రచయితగా (సంభాషణలు) జాతీయ అవార్డు దక్కింది. బాకాస్ఫీస్‌ను ఓ ఊపు ఊపేసిన చిత్రం ‘పుష్ప2’ ఏకంగా రెండు జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది. ఈ మూవీని ఆద్యంతం అలరించేలా తీర్చిదిద్దిన దర్శకుడు సుకుమార్ ఉత్తమ స్క్రీన్ప్లే రచయిత (ఒరిజినల్) కేటగిరిలో అవార్డుకు ఎంపిక కాగా, ఉత్తమ కాస్టూయూమ్ డిజైనర్‌గా దీపాలి నూర్, సీతల్ శర్మలకు అవార్డు దక్కింది. చిన్న చిత్రం కాదు…ప్రతి ఒక్కరి మనుసుల్ని హత్తుకునేంత పెద్ద చిత్రమనిపించింది ‘35-చిన్న కథ కాదు’. ఇప్పుడు జాతీయ అవార్డుల్లో ఉత్తమ బాలల చిత్రంతో పాటు, ఉత్తమ బాల నటుడిగా అరుణ్దేవ్ పోతుల అవార్డుకు ఎంపికయ్యారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు