దిల్లీ హైకోర్టును ఆశ్రయించిన గీతాంజలి
న్యూదిల్లీ: పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్చుక్ భార్య గీతాంజలి ఆంగ్మో దిల్లీ హైకోర్టు ను ఆశ్రయించారు. తన భర్తను వెంటనే ప్రైవేటు ఆసుపత్రికి తరలించేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. సఫ్దర్జంగ్ ఆసుపత్రిలో ఆయనను అక్రమంగా నిర్బంధించారని పిటిషన్లో ఆరోపించారు. ఆయనకు చికిత్స అందించిన వ్యక్తిగత వైద్యులు, న్యాయవాదులను కలిసే అవకాశం కల్పించాలని అభ్యర్థించారు.
21 రోజులుగా కొనసాగుతున్న నిరాహార దీక్షా శిబిరం నుంచి పోలీసులు వాంగ్చుక్ను శనివారం సఫ్దర్జంగ్ ఆసుపత్రికి తరలించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆయన ఆసుపత్రిలోనే దీక్ష కొనసాగిస్తున్నారని ఆంగ్మో తెలిపారు. చికిత్స విషయంలో ఆసుపత్రి పారదర్శకంగా వ్యవహరించడం అనుమానం వ్యక్తం చేశారు. ఆ ఆసుపత్రిపై తమకు నమ్మకం పోయిందన్నారు. డిశ్చార్జ్ చేయాలని, ప్రైవేట్ ఆసుపత్రికి తరలించాలని కోరినా అధికారులు నిరాకరించారని ఆవేదన వ్యక్తం చేశారు. వంద మందికి పైగా పోలీసులు ఆసుపత్రిలో మోహరించారని…వాంగ్చుక్ ఉన్న అంతస్తులోనే 30 మంది సిబ్బంది ఉన్నట్లు పేర్కొన్నారు. అక్కడ తనపై ఆంక్షలు విధించారని, తనను కలుసుకునేందుకు అవకాశం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
వాంగ్చుక్ను ప్రైవేటు ఆసుపత్రికి అనుమతించాలి
- Advertisement -
RELATED ARTICLES


