విశాలాంధ్ర అనంతపురం టౌన్ అనంతపురం జిల్లా జైలులో ఒక వారం నుండి ఖైదీల మానసిక శాంతి కోసం నిర్వహించిన ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ జైలు కార్యక్రమం” సోమవారం ముగిసింది. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఉపాధ్యాయురాలు కర్నూలు మమత ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. 60 మంది ఖైదీలు శక్తివంతమైన సుదర్శన క్రియను అనుభవించారు మరియు గొప్ప అనుభవాన్ని, ప్రశాంతతని పొందారు. జిల్లా జైలు సూపరింటెండెంట్ వేణుగోపాల్ మాట్లాడుతు , ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర్వులను గౌరవిస్తు ఈ కార్యక్రమం ఖైదీల కోసం నిర్వహించబడిందన్నారు . ఖైదీల అనుభవాలను విని, ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్‌కు కృతజ్ఞతలు తెలిపారు, మానసిక ప్రశాంతత ,ఒత్తిడి నుండి బయటపడటానికి ఈ కార్యక్రమం చాలా అసరమన్నారు ఖైదీలందరూ చాలా సంతోషం, కృతజ్ఞత వ్యక్తపరుస్తు, ప్రతిరోజు సుదర్శన క్రియను అభ్యసించడం కొనసాగిస్తామని కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాo అని వాగ్దానం చేశారు. ఈ కార్యక్రమం జైలర్ ధనుజయ్ , జైలర్ . రఘునాథ మరియు సిబ్బంది వారి పరిశీలనలోజరిగింది.


