Homeజిల్లాలుకర్నూలుతల్లికి వందనం తో అంగన్వాడీ కుటుంబాల్లో అనందం

తల్లికి వందనం తో అంగన్వాడీ కుటుంబాల్లో అనందం

- Advertisement -

విశాలాంధ్ర – పెద్దకడబూరు :(కర్నూలు) : అంగన్వాడీ కార్యకర్తల, ఆయాల పిల్లలకు కూడా తల్లికి వందనం పథకాన్ని వర్తింపజేస్తూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ సోమవారం మండల కేంద్రమైన పెద్దకడబూరులో టీడీపీ రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంతరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి నరవ శశిరేఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ చిత్రపటాలకు అంగన్వాడీ సిబ్బంది పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడీ సిబ్బంది కుటుంబాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అభినందనీయమన్నారు. సమాజ సేవలో కీలక పాత్ర పోషిస్తున్న రాష్ట్ర వ్యాప్తంగా 47,555 మంది అంగన్వాడీ సిబ్బంది పిల్లలకు ఎంతగానో ఊరటనిస్తుందన్నారు. చంద్రబాబు సారథ్యంలోనే అంగన్వాడీ సిబ్బంది సంక్షేమానికి విశేష ప్రాధాన్యత లభించిందని, గతంలో పలుమార్లు వేతనాలు పెంచి అంగన్వాడీ కుటుంబాల ఆర్థిక స్థితి మెరుగుపడేందుకు కృషి చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుదేనని కొనియాడారు. భవిష్యత్తులో కూడా అంగన్వాడీల సిబ్బంది సమస్యలు, కోరికలను కూటమి ప్రభుత్వం సానుకూలంగా పరిష్కరిస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. మా పిల్లల భవిష్యత్తుకు భరోసా కల్పించిన ముఖ్యమంత్రికి అంగన్వాడీ సిబ్బంది ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ ఛైర్మన్ మీసేవ ఆంజనేయులు, కోసిగి మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ బొగ్గుల తిక్కన్న, మాజీ సర్పంచ్ నరసన్న, నాయకులు శ్రీనివాసులు, ఇమ్మానుయేలు, బజారి, జైపాల్,పెద్ద హనుమంతు, ఆయా గ్రామాల అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు