Homeజిల్లాలుఅనంతపురంప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం…

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం…

- Advertisement -

జిల్లా జాయింట్ కలెక్టర్
సి.విష్ణు చరణ్
విశాలాంధ్ర అనంతపురం టౌన్ : ప్రజా సమస్యలను వేగంగా, పారదర్శకంగా, నిబంధనల మేరకు పరిష్కరించడమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా జాయింట్ కలెక్టర్ సి. విష్ణు చరణ్ తెలిపారు.
సోమవారం జిల్లా కలెక్టరేట్ లోని రెవెన్యూ సమావేశ మందిరంలో ప్రజాసమస్యల పరిష్కార వేదిక
(పి జి ఆర్ఎస్ )రెవెన్యూ క్లినిక్ కార్యక్రమా లకు సంబంధించిన అర్జీలను ప్రజల నుండి జాయింట్ కలెక్టర్ స్వీకరించారు.ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు సమర్పించిన ప్రతి ఫిర్యాదు అర్జీని పరిశీలించి సమస్యల పరిష్కారానికి సంబంధితశాఖలఅధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలోజిల్లా రెవెన్యూ అధికారి ఏ. మాలోల, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు మల్లి కార్జున రెడ్డి , కిరణ్మయి జిల్లా పౌరసరఫరాల సంస్థ మేనేజర్ రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు