యువర్స్ ఫౌండేషన్ అధ్యక్ష, కార్యదర్శులు.. నాగేంద్ర, జయరాం
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని కొత్తపేటలో గల శ్రీ ఉషోదయ ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాల యందు జూలై 26వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఉచిత మెగా వైద్య శిబిరము నిర్వహిస్తున్నట్లు అధ్యక్షులు షీలా నాగేంద్ర, కార్యదర్శి ఆర్. జయరాం, కోశాధికారి ఆర్ వెంకట నాగర్జున, క్యాంపు చైర్మన్లు పోలా ప్రభాకర్, షేక్ చాంద్ భాషా తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ శిబిరము కీర్తిశేషులు జే సూర్య కుమారి, అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ వారి సహకారంతో నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ శిబిరంలో ప్రతి ఒక్కరికి వైద్య పరీక్షలు పూర్తిగా ఉచితముతో పాటు మందులు కూడా ఇవ్వబడును అని తెలిపారు. వివిధ అనారోగ్య సమస్యలు ఉన్నవారు పాత రిపోర్టులు లేదా తమ వైద్యుల సలహాల మేరకు అవసరమైన పరీక్షలు చేయించుకొని రావాలని తెలిపారు. ఈ శిబిరంలో డాక్టర్ వై. సుభాష్ చంద్రబోస్-కార్డియాలజిస్ట్, డాక్టర్ ముంతా మాధవి- గైనకాలజిస్ట్, డాక్టర్ ఏ. అపర్ణ ఈ ఎన్ టి వైద్య నిపుణులు, ఆప్తాలమిక్ అసిస్టెంట్- షేక్ సికిందర్, జనరల్ ఫిజీషియన్ డాక్టర్ కే. వీరభద్రయ్య, జనరల్ సర్జన్ డాక్టర్ కే. కొండయ్య, దంత వైద్య నిపుణులు- డాక్టర్ మనోజ్ కుమార్, ఎముకలు, కీళ్ల వైద్య నిపుణులు- డాక్టర్. జె. భాను కిరణ్, న్యూరాలజిస్ట్- డాక్టర్ చవిటిపల్లి అభిషేక్, చిన్నపిల్లల వైద్య నిపుణులు- డాక్టర్, జివి సుబ్బారావు పాల్గొని రోగులకు తగిన వైద్య చికిత్సలు నిర్వహిస్తారని, తదుపరి ఆరోగ్యం పట్ల తీసుకోవలసిన జాగ్రత్తలు కూడా వివరిస్తారని తెలిపారు. మరిన్ని వివరాలకు పోలా ప్రభాకర్ సెల్ నెంబర్ 9440683100 కు గాని, షేక్ చాంద్ భాషా సెల్ నెంబర్ 9440209959 కు సంప్రదించాలని తెలిపారు. కావున ఈ అవకాశాన్ని ధర్మవరంలోని పట్టణ ప్రజలు, గ్రామీణ ప్రజలు సద్వినియోగం చేసుకొని తమ ఆరోగ్యమును కాపాడుకోవాలని వారు తెలిపారు.
ఉచిత మెగా వైద్య శిబిరమును సద్వినియోగం చేసుకోండి..
- Advertisement -
RELATED ARTICLES


