Homeజిల్లాలుఅనంతపురంకాశిరెడ్డినాయన ఆశ్రమం వద్ద యువకుడి మృతి

కాశిరెడ్డినాయన ఆశ్రమం వద్ద యువకుడి మృతి

- Advertisement -

విశాలాంధ్ర – నార్పల: -మండల పరిధిలోని కేశేపల్లి గ్రామంలోని కాశిరెడ్డినాయన ఆశ్రమం వద్ద సోమవారం తెల్లవారుజామున మీసాల భాస్కర్ (30) మృతిచెందాడు.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు కేశేపల్లి గ్రామంలోని ఎస్సీ కాలనీలో నివాసం ఉంటున్న మీసాల రామకృష్ణ, పెద్దక్క దంపతులకు ముగ్గురు కుమారులు ఉన్నారు. వీరిలో రెండో కుమారుడు భాస్కర్ వారం రోజుల క్రితం బైక్‌పై నుంచి కిందపడి గాయపడ్డాడు. గాయాలైనప్పటికీ మద్యం సేవించడం కొనసాగించేవాడని కుటుంబ సభ్యులు తెలిపారు.ఈ విషయంపై రెండు రోజుల క్రితం ఇంట్లో గొడవపడి బయటకు వెళ్లిపోయాడు. ఆదివారం రాత్రి మద్యం సేవించి కాశిరెడ్డినాయన ఆశ్రమం వద్దకు వెళ్లి అక్కడే నిద్రించాడు. సోమవారం ఉదయం ఆశ్రమం వద్ద ఉన్న వారు లేపేందుకు ప్రయత్నించగా ఎంతకీ లేవకపోవడంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా అప్పటికే భాస్కర్ మృతి చెందినట్లు గుర్తించారు. చేతికి వచ్చిన కుమారుడు మృతిచెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు