విశాలాంధ్ర – జేఎన్టీయూ ఏ: పీవీకేకే ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (అటానమస్) ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో, ఐబీఎం స్కిల్బిల్డ్, మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ మరియు కార్పొరేట్ రెడీనెస్ ట్రైనింగ్ సెల్ సంయుక్త సహకారంతో కృత్రిమ మేధస్సు – సైబర్ భద్రత అంశంపై వారం రోజుల ప్రత్యేక శిక్షణ శిబిరం సోమవారం ఘనంగా ప్రారంభించారు.ఈ శిక్షణలో మూడవ సంవత్సరం ఈసీఈ విద్యార్థులకు కృత్రిమ మేధస్సు, యంత్ర అభ్యాసం, జనరేటివ్ ఏఐ, ప్రాంప్ట్ ఇంజినీరింగ్, సైబర్ భద్రత, నైతిక హ్యాకింగ్, నెట్వర్క్ భద్రత, డిజిటల్ రక్షణ, ఆన్లైన్ మోసాల నివారణ, సమాచార భద్రత వంటి అత్యాధునిక అంశాలపై నిపుణుల , సిద్ధాంత, ప్రాయోగిక శిక్షణ అందించనున్నారు.ఈ సందర్భంగా కళాశాల *చైర్మన్ డాక్టర్ పల్లె వెంకట కృష్ణ కిశోర్ మాట్లాడుతూ.. భవిష్యత్తు ప్రపంచాన్ని కృత్రిమ మేధస్సు, సైబర్ భద్రత రంగాలే నడిపించనున్నాయని అన్నారు. సాంకేతిక పరిజ్ఞానంలో వేగంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యార్థులు తమ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. పరిశ్రమలకు అవసరమైన సాంకేతిక నైపుణ్యాలను అందించేందుకు కళాశాల ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని తెలిపారు. ప్రిన్సిపాల్ డాక్టర్ బండి రమేష్ బాబు మాట్లాడుతూ.. నేటి డిజిటల్ యుగంలో ప్రతి ఇంజినీరింగ్ విద్యార్థికి కృత్రిమ మేధస్సు, సైబర్ భద్రతపై అవగాహన అత్యంత అవసరమని అన్నారు. విద్యార్థులు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని నేర్చుకోవడంతో పాటు పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను కూడా సొంతం చేసుకుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలోఉప ప్రిన్సిపాల్ మరియు ఈసీఈ విభాగాధిపతి డాక్టర్ దీప్తి జోర్డానా, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.


