విశాలాంధ్ర – పెద్దకడబూరు :(కర్నూలు) : ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే కార్డు లబ్ధిదారులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేయాలని తహసీల్దార్ వలిబాషా డీలర్లను ఆదేశించారు. మంగళవారం మండల కేంద్రంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో డీలర్లకు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి నెలా 26వ తేదీన వృద్ధులకు, వికలాంగులకు బియ్యం పంపిణీ చేయాలని సూచించారు. కార్డు లబ్ధిదారుల నుంచి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేసినా, అసభ్యంగా ప్రవర్తించినా వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బియ్యం పంపిణీ సమయంలో కార్డు దారులకు ప్రభుత్వ పోస్టర్లను అందజేసి వారి ఫోన్ నెంబర్, వివరాలను సేకరించాలని తహసీల్దార్ డీలర్లకు సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ గీతా ప్రియదర్శిని, ఆర్ఐ జెర్మియా, డీలర్లు పాల్గొన్నారు.


