Homeజాతీయంన్యాయస్థానంలో వాంగ్‌చుక్‌కు ఊరట

న్యాయస్థానంలో వాంగ్‌చుక్‌కు ఊరట

- Advertisement -

ప్రైవేటు ఆసుపత్రికి తరలించేందుకు దిల్లీ హైకోర్టు అనుమతి
న్యూదిల్లీ:
పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్‌కు దిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. విద్యా వ్యవస్థలో వైఫల్యాలపై 20 రోజులకు పైగా నిరాహార దీక్ష చేస్తోన్న వాంగ్‌చుక్‌ను ప్రైవేట్ ఆసుప్రతికి తరలించేందుకు కోర్టులో మంగళవారం అనుమతించింది. ఆయన ఆందోళనను విస్మరించలేమని అభిప్రాయం వ్యక్తం చేసింది. సఫ్దర్జంగ్ ఆసుపత్రి నుంచి మేదాంతకు తీసుకెళ్లేందుకు అంగీకరించింది. ఈ నిర్ణయంపై వాంగ్‌చుక్ భార్య గీతాంజలి ఆంగ్మో హర్షం వ్యక్తం చేశారు. వాంగ్‌చుక్ ఆరోగ్యం విషమించే ప్రమాదం ఉందని, ప్రైవేట్ ఆస్పత్రికి తరలించాలని ఆయన భార్య గీతాంజలి చేసిన అభ్యర్థనపై హైకోర్టు విచారణ చేపట్టింది. ఆయనను ప్రైవేటు ఆసుపత్రికి ఎందుకు తరలించకూడదని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను కోర్టు ప్రశ్నించగా…దీనిపై కేంద్రానికి ఎటువంటి అభ్యంతరం లేదని ఆయన తెలిపారు. కాగా తన పోరాటం ఆగదని వాంగ్‌చుక్ స్పష్టం చేశారు. పరీక్షల వ్యవస్థలో మార్పులు రావాలని, లీకేజీలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, శాంతియుతంగా విద్యార్థులు చేసిన ర్యాలీని అడ్డుకుని పోలీసులు వారిపై లాఠీచార్జ్ చేయడం దుర్మార్గం అన్నారు

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు