Homeఅంతర్జాతీయంవాంగ్‌చుక్‌కు దీక్షకు పెరుగుతోన్న మద్దతు

వాంగ్‌చుక్‌కు దీక్షకు పెరుగుతోన్న మద్దతు

- Advertisement -

అమెరికాలోని హిందూస్ ఫర్ హ్యూమన్ రైట్స్‌ నిరసనలు
న్యూయార్క్:
ప్రశ్న పత్రాల లీకేజీలు, విద్యా వ్యవస్థలో వైఫల్యాలను నిరసిస్తూ సీజేపీ అధ్యర్యంలోని విద్యార్థులు దిల్లీలో చేస్తున్న పోరాటానికి మద్దతుగా నిరాహార దీక్ష చేపట్టిన పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్‌కు దేశ విదేశాల్లో మద్దతు పెరిగింది. దేశంలోని కాంగ్రెస్ సహా టీఎంసీ, ఆర్జేడీ, ఎన్‌సీపీ (ఎస్‌పీ), ఆమ్ ఆద్మీ వంటి ప్రతిపక్షాలు మద్దతుగా నిలిచాయి. మంగళవారం లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ అధ్వర్యంలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాని నివాసం ముందు పెద్ద ఎత్తున ఆందోళనలు జరిపారు. టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ కూడా దీక్షకు మద్దతుగా దీక్ష చేపడతానని ప్రకటించారు. ఇదిలా ఉండగా…వాంగ్‌చుక్‌కు అమెరికాలోనూ మద్దతు లభిస్తోంది. న్యూయార్క్, శాన్జోస్ నగరాల్లో ‘హిందూస్ ఫర్ హ్యూమన్ రైట్స్‌’ సంస్థ కార్యకర్తలు నిరసన చేపట్టారు. వాంగ్‌చుక్‌కు మద్దతుగా నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్చలు జరపాలని కోరారు. లండన్‌లోని భారత హైకమిషన్, డబ్లిన్‌లోని రాయబార కార్యాలయం ఎదుట నిరసనలు జరిగాయాని సంస్థ వెల్లడించింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు