Homeఆంధ్రప్రదేశ్పబ్లిక్ డేటా ఎంట్రీతో భూ రిజిస్ట్రేషన్లు

పబ్లిక్ డేటా ఎంట్రీతో భూ రిజిస్ట్రేషన్లు

- Advertisement -


విశాలాంధ్ర–గూడూరు: రాష్ట్రవ్యాప్తంగా దస్తావేజు రచయితలు (డాక్యుమెంట్ రైటర్లు) చేపట్టిన పెన్‌డౌన్ కారణంగా భూ క్రయవిక్రయ రిజిస్ట్రేషన్లలో జాప్యం ఏర్పడుతున్న నేపథ్యంలో, గూడూరు సబ్-రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ప్రత్యామ్నాయంగా పబ్లిక్ డేటా ఎంట్రీ విధానంలో రిజిస్ట్రేషన్లు నిర్వహిస్తున్నట్లు గూడూరు సబ్-రిజిస్ట్రార్ శ్రీధర్ గుప్తా శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దస్తావేజు రచయితల సేవలు అందుబాటులో లేకపోయినా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. పబ్లిక్ డేటా ఎంట్రీ సదుపాయాన్ని వినియోగించుకుని రైతులు, ప్రజలు తమ భూ రిజిస్ట్రేషన్లను సకాలంలో పూర్తి చేసుకోవచ్చని సూచించారు. రిజిస్ట్రేషన్‌కు అవసరమైన పత్రాలతో కార్యాలయాన్ని సంప్రదించి ఈ సేవను వినియోగించుకోవాలని ఆయన కోరారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు