Homeజిల్లాలుఅనంతపురంచేనేత కార్మికులకు రూ.179.53 కోట్లు జమ చేయడం అభినందనీయం

చేనేత కార్మికులకు రూ.179.53 కోట్లు జమ చేయడం అభినందనీయం

- Advertisement -

విశాలాంధ్ర,ఉరవకొండ (అనంతపురం జిల్లా) : జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని 71,500 మంది చేనేత కార్మికులకు రూ.179.53 కోట్లను నేతన్న సేవ పథకం కింద జమ చేయడం అభినందనీయమని ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి చంగల మహేష్ అన్నారు.
చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టాలని కోరారు. శుక్రవారం ఉరవకొండలో ఏర్పాటుచేసిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ
చేనేత వస్త్రాలు, ముడి సరుకులపై జీఎస్టీని పూర్తిగా రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి చేనేత కార్మికుడికి కనీసం మూడు సెంట్ల ఇంటి స్థలం కేటాయించి, హౌసింగ్ ద్వారా ఇల్లు నిర్మించి ఇవ్వాలని కోరారు.
ప్రతి జిల్లాలో టెక్స్‌టైల్ పార్కులు ఏర్పాటు చేయాలని, 50 ఏళ్లు దాటిన చేనేత కార్మికులకు పెన్షన్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
జాతీయ చేనేత దినోత్సవాన్ని ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు.
చేనేత కార్మికుల ఖాతాల్లో రూ.25 వేల చొప్పున జమ చేసిన సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రి సవిత, మంత్రి పయ్యావుల కేశవ్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి పయ్యావుల కేశవ్‌ల చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో చందా రాము, పెద్దకోట్ల శ్రీనివాసులు, చంగల కాశీనాథ్, పెద్దకోట్ల రవి, బుట్టా తిప్పయ్య తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు