Homeజిల్లాలుశ్రీ సత్యసాయికంటిపట్ల విద్యార్థులు జాగ్రత్తలు తప్పనిసరిగా వహించాలి

కంటిపట్ల విద్యార్థులు జాగ్రత్తలు తప్పనిసరిగా వహించాలి

- Advertisement -

ఆప్తాలమిక్ ఆఫీసర్ ఉరుకుందప్ప
విశాలాంధ్ర ధర్మవరం;; కంటిపట్ల విద్యార్థులు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని ఆప్తాలమిక్ ఉరుకుందప్ప తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణములోని ఇందిరమ్మ కాలనీలో గల మున్సిపల్ ఉన్నత పాఠశాలలోని విద్యార్థులకు జిల్లా అందత్వ నివారణ సంస్థ ద్వారా కంటి పరీక్షలను నిర్వహించారు. 150 మంది విద్యార్థులకు కంటి పరీక్షలు చేసి ఐదు మంది విద్యార్థులకు కంటి అద్దములను అవసరమని తెలిపారు. విద్యార్థులకు కంటి సంరక్షణ గూర్చి జాగ్రత్తలు కూడా తెలియజేశారు. కంటి అడ్డములు త్వరలో ప్రభుత్వం ద్వారా అందించబడునని తెలిపారు.ఈ కార్యక్రమంలో మలేరియా అసిస్టెంట్ శ్రీనివాసులు, ఆశా కార్యకర్తలు అరుణ, లలితమ్మ, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రమణప్ప ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు