కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సుల వినతి పత్రం అందజేత
విశాలాంధ్ర – రామచంద్రపురం : రామచంద్రాపురం ఏరియా ఆసుపత్రిలో కాంట్రాక్ట్ విధానంలో పని చేస్తున్న స్టాఫ్ నర్సులు తమ న్యాయమైన సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, లేనిపక్షంలో దశల వారి ఉద్యమంలో భాగంగా, సెప్టెంబర్ 8వ తేదీ నుంచి విధులను బహిష్కరిస్తామన్నారు . ఈ మేరకు శనివారం ఏపీ ఎన్జీవోస్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షుడు మాధవరపు వెంకటేశ్వర్లుకు తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, నర్సుల సమస్యలను ఏపీ ఎన్జీవోస్ రాష్ట్ర అధ్యక్షుడు అలపర్తి విద్యాసాగర్ దృష్టికి తీసుకెళ్లి, ప్రభుత్వంతో చర్చించి త్వరలోనే న్యాయం జరిగేలా చూస్తామని ఆయన అన్నారు. ఉద్యోగులంతా సంఘానికి సహకరిస్తూ, ఐక్యమత్యంతో సమస్యలను పరిష్కరించుకుందామని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో రామచంద్రపురం యూనిట్ ఉపాధ్యక్షుడు ప్రవీణ్, మహిళా వింగ్ అధ్యక్షురాలు రోజా మణి, హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షుడు గొల్లపల్లి కృష్ణ, రిటైర్డ్ డిప్యూటీ పారామెడికల్ ఆఫీసర్ బక్కి రవీంద్ర మరియు కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు పాల్గొన్నారు.


