Homeసీపీఐ నేతలు, కార్యకర్తల గృహ నిర్బంధం

సీపీఐ నేతలు, కార్యకర్తల గృహ నిర్బంధం

- Advertisement -

డి.రాజా తీవ్ర ఆగ్రహం
అమిత్‌షా జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో సీపీఐ నేతలు, కార్యకర్తలపై పోలీసులు దాడులు చేస్తూ…అనేకమందిని అక్రమంగా గృహ నిర్బంధం చేయడాన్ని సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా తీవ్రంగా ఖండించారు. సోమవారం దిల్లీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ అంశంపై తీవ్రంగా స్పందించారు. దేశ రాజధానిలో సెప్టెంబరు 1 (మంగళవారం) న సీపీఐ అధ్వర్యంలో ‘బద్లావ్ జరూరీ హై’ పేరుతో ర్యాలీ నిర్వహించనున్న నేపథ్యంలో యూపీ నుంచి దిల్లీకి బయలుదేరిన పార్టీ శ్రేణులను అక్కడి పోలీసులు అడ్డుకుంటున్నారని రాజా పేర్కొన్నారు. వివిధ జిల్లాల్లో సీపీఐ నాయకులు, కార్యకర్తల ఇళ్లపై దాడులు, తనిఖీలు నిర్వహించడంతో పాటు వారిని బయటకు రాకుండా నిర్బంధిస్తున్నారని తెలిపారు. ఈ మేరకు అలీగఢ్, హాథ్రస్, ఘాజియాబాద్, సంభల్, షాజహాన్పూర్ తదితర జిల్లాల నుంచి తమకు సమాచారం అందిందని పేర్కొన్నారు. దిల్లీ ర్యాలీలో పాల్గొనవద్దంటూ కొందరు పార్టీ కార్యకర్తలను పోలీసులు బెదిరిస్తున్నారని చెప్పారు. ప్రజాస్వామ్య దేశంలో రాజకీయ కార్యక్ర మాల్‌లో పాల్గొనే హక్కును పోలీసులు అడ్డుకోవడం రాజ్యాంగ హక్కుల ఉల్లంఘనకు దారితీస్తుందని రాజా అన్నారు. యూపీ పోలీసుల చర్య లను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా జోక్యం చేసుకుని, సీపీఐ నేతలు, కార్య కర్తలపై ఎలాంటి అక్రమ చర్యలు తీసుకోకుండా యూపీ పోలీసులను ఆదేశించాలని రాజా కోరారు. ఈ మేరకు కేంద్ర మంత్రికి లేఖ రాసి నట్లు తెలిపారు. పార్టీ నేతలు, కార్యకర్తలను నిర్బంధించడం, బెదిరిం చడం రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులకు, రాజకీయ పార్టీలకు చట్టాల ద్వారా లభించిన హక్కులకు విరుద్ధమని రాజా పేర్కొన్నారు. ఇది ప్రజాస్వామ్య దేశంలో ప్రజల ప్రజాస్వామిక హక్కులను హరించ డమేనని అన్నారు. మీడియా సమావేశంలో సీపీఐ ఎంపీ పి. సంతోశ్ కుమార్, జాతీయ సమితి సభ్యులు డా. గిరీశ్, కె. ప్రకాశ్ బాబు, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి, జాతీయ కార్యవర్గ సభ్యుడు అరవింద్ రాజ్ స్వరూప్, దిల్లీ రాష్ట్ర కార్యదర్శి ప్రొఫెసర్ దినేశ్ వర్ష్‌నే పాల్గొ న్నారు. ఉత్తరప్రదేశ్‌లోని వివిధ జిల్లాల్లో సీపీఐ నాయకులు, కార్యకర్త లపై జరుగుతున్న దాడులు, గృహ నిర్బంధాలపై మాట్లాడారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు