- Advertisement -
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని గుట్ట కింద పల్లి లో గల కేహెచ్ డిగ్రీ కళాశాల ఆడిటోరియ నిర్మాణానికి ప్రముఖ టిడిపి నాయకుడు సంధ రాఘవ, సన్దా రవీంద్ర కలసి మూడు లక్షల పదివేల రూపాయలను విరాళంగా అందజేశారు. కళాశాల ప్రిన్సిపాల్ ప్రభాకర్ రెడ్డితో కలిసి వారు ఆడిటోరియాన్ని పరిశీలించారు. భవిష్యత్తులో డిగ్రీ కళాశాల అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తామని వారు తెలిపారు. తదుపరి ప్రిన్సిపాల్ ప్రభాకర్ రెడ్డితోపాటు అధ్యాపకులు విద్యార్థులు దాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.


