Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఏపీ చేనేత కార్మిక సంఘం మాజీ రాష్ట్ర అధ్యక్షులు పోలా రామాంజనేయులు మూడవ వర్ధంతి

ఏపీ చేనేత కార్మిక సంఘం మాజీ రాష్ట్ర అధ్యక్షులు పోలా రామాంజనేయులు మూడవ వర్ధంతి

- Advertisement -

విశాలాంధ్ర ధర్మవరం;; ఏపీ చేనేత కార్మిక సంఘం మాజీ రాష్ట్ర అధ్యక్షులు పోలా రామాంజనేయులు వారి మూడవ వర్ధంతి వేడుకలు ధర్మవరం చేనేత ఆఫీసు నందు ఏపీ చేనేత కార్మిక సంఘం సిపిఎం పార్టీ నాయకులు ఎస్హెచ్ భాష, చేనేత కార్మిక సంఘం జిల్లా కన్వీనర్ జే వి.రమణ మాట్లాడుతూ కామ్రేడ్ పోలా రామాంజనేయులు తన జీవితకాలం చేనేత కార్మికుల సంక్షేమం కోసం అనేక పోరాటాలు నిర్వహించిన ఘనత ఆయనకు దక్కినదని, కార్మికుల కోసం ,కర్షకుల కోసం రాజీలేని అనేక రకాల పోరాటాల నిర్వహించారని తెలిపారు. చేనేత కార్మికులకు గిట్టుబాటు ధరల విషయంలో కూలి రేట్లు పెంచడంలో , వార్పు ,రేషాలు ధరలు విపరీతంగా పెరిగినప్పుడు వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి కార్మికులకు న్యాయం జరిగే విధంగా పోరాటాలు నిర్వహించారని, ధర్మవరం ప్రాంతంలో పవర్ లూమ్స్ రాకుండా చేనేత కార్మికుల కాపాడాలని అనేక సంవత్సరాలు పోరాటాలు నిర్వహించాడని తెలిపారు.
ఈ కార్యక్రమంలో చేనేత కార్మిక సంఘం పట్టణ అధ్యక్ష కార్యదర్శులు ఏ ఖాదర్బాషా, గుంపు హరి, చేనేత నాయకులు అన్నం సూరి ,పులిచెర్ల హరి, లోకేష్ ,సిఐటియు నాయకులు ఎల్ ఆదినారాయణ పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు