సీనియర్ ఆప్తోమెట్రిస్ట్ ప్రసాద్
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని సాయిబాబా దేవాలయంలో నిర్వహించిన ఉచిత కంటి మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన రావడం జరిగిందని సీనియర్ ఆప్తో మెట్రిస్ట్ ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా సాయిబాబా దేవాలయంలో శ్రీ షిరిడి సాయిబాబా సేవా సమితి సహకారంతో ఈ శిబిరమును నిర్వహించుట మాకెంతో సంతోషంగా ఉందని తెలిపారు. ఈ శిబిరంలో మొత్తం 70 మంది కంటి రోగులు పాల్గొనగా అందులో 25 మంది కంటి ఆపరేషన్లకు ఎంపిక కావడం జరిగిందని వారు తెలిపారు. ఈ శిబిరం షిరిడి సాయిబాబా సేవాసమితి ధర్మవరం పుష్పగిరి కంటి ఆసుపత్రి కడప జిల్లా అంధత్వ నివారణ సంస్థ శ్రీ సత్యసాయి జిల్లా ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగిందని తెలిపారు. అనంతరం కంటిపట్ల తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ శిరిడి సాయిబాబా సేవా సమితి అధ్యక్షులు సూర్య ప్రకాష్, రామలింగయ్య, ఇతర సభ్యులు పాల్గొన్నారు.
ఉచిత కంటి మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన..
- Advertisement -
RELATED ARTICLES


