Friday, March 14, 2025
Homeజిల్లాలుఅనంతపురంజై కిసాన్ ఫౌండేషన్ కు అనంత అవార్డు

జై కిసాన్ ఫౌండేషన్ కు అనంత అవార్డు

విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : ఉరవకొండ పట్టణానికి చెందిన జై కిసాన్ ఫౌండేషన్ గత ఏడు సంవత్సరాలుగా వ్యవసాయ అభివృద్ధికి చేస్తున్న కృషికి ఫలితంగా అనంత అవార్డు అందుకున్నది 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం జిల్లా కేంద్రంలో కలెక్టర్ వినోద్ కుమార్ చేతుల మీదుగా ఫౌండేషన్ వ్యవస్థాపకులు నాగమల్లి ఓబులేసు రజిని కుమారి దంపతులు అనంత అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా నాగమల్లి ఓబులేసు మాట్లాడుతూ గత అనేక సంవత్సరాలుగా జై కిసాన్ ఫౌండేషన్ వ్యవసాయ అభివృద్ధికి కృషి చేస్తుందని తమ ఫౌండేషన్ యొక్క కృషి, సేవలను గుర్తించి జిల్లా కలెక్టర్ అనంత అవార్డు అందించడం హర్షనీయమన్నారు. ఈ సందర్భంగా వారు జిల్లా కలెక్టర్ కు కృతజ్ఞతలు తెలియజేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు