రెండు కార్లపై దాడులు
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని పేరు బజారు వద్ద గల మసీదు వద్ద టీడీపీ బీజీపీ వాళ్లకు మధ్య ఘర్షణలు కావడం, రెండు కార్లపై బిజెపి వాళ్లు దాడులు చేస్తున్నట్లు వన్టౌన్ సీఐ నాగేంద్ర ప్రసాద్ కు తెలియడంతో హుటాహుటిన డిఎస్పి శ్యామ్ కుమార్ ఆదేశాల మేరకు అక్కడ జరుగుతున్న గొడవలు ఆపి, అందరినీ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. గొడవలకు కారణాలపై ఆరా తీస్తున్నారు. మొత్తం మీద వన్ టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర పెద్ద ఎత్తున టిడిపి, బిజెపి వాళ్లు చేరుకొని.. జరిగిన సమాచారం పై వారు తెలుసుకొని, న్యాయం కోసం పోలీస్ స్టేషన్కు రావడం జరిగింది. అనంతరం వన్టౌన్ సిఐ మాట్లాడుతూ సరైన విచారణ జరిపి, దాడుల చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకొని కేసు నమోదు చేస్తామని తెలిపారు. మొత్తం మీద ఏమి జరిగింది? ఎవరు దీనికి కారణం అన్న కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
టిడిపి బిజెపి మధ్య గొడవలు
RELATED ARTICLES