Sunday, February 16, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయికార్పెంటర్ కు ఏ కష్టం వచ్చిన ముందుండాలి

కార్పెంటర్ కు ఏ కష్టం వచ్చిన ముందుండాలి

ధర్మవరంలో అనారోగ్యం మృతి చెందిన కార్పెంటర్

ఆర్థిక సాయం చేసి అండగా నిలిచిన శ్రీ విశ్వకర్మ కార్పెంటర్స్ అసోసియేషన్

ఆసోషియేషన్ బలోపేతానికి అందరూ కలసి రావాలని పిలుపు
విశాలాంధ్ర ధర్మవరం: విశాలాంధ్ర ధర్మవరం; పట్టణానికి చెందిన కార్పెంటర్ ఖాజా అనే వ్యక్తి అనారోగ్యం మృతి చెందగా.. ఆయన కుటుంబానికి శ్రీ విశ్వకర్మ కార్పెంటర్స్ అసోషియేషన్ అండగా నిలిచింది. అసోషియేషన్ ముఖ్య నాయకులంతా కలసి ఖాజాకు ఘనంగా నివాళలర్పించారు. అనంతరం ఖాజా సతీమణిని కలిసి ఆర్థిక సాయం అందజేశారు. అధైర్య పడవద్దని భవిష్యత్ లో కూడా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం ఆదివారం ఉదయం కార్పెంటర్స్ అసోషియేషన్ నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు శివ, గౌరవాధ్యక్షులు శంకర, కౌన్సిలర్ బ్రహ్మయ్య మాట్లాడుతూ.. ఖాజా మృతి చెందడం బాధాకరమన్నారు. భవిష్యత్ లో ఏ కార్పెంటర్ కి కష్టం వచ్చినా.. అసోషియేషన్ అండగా నిలుస్తుందన్నారు. మరోవైపు కార్పెంటర్లకు, పెయింటర్లకు ఐడీ కార్డుల అంశంపై చర్చించారు. ప్రతి ‍ఒక్కరికీ గుర్తింపు కార్డు ఉండాలన్నారు. అసోషియేషన్ కు ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో భవన నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. అందరం ఐక్యంగా ఉండి.. వృత్తి పరంగా ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కొంటూ కార్మికుల సంక్షేమం కోసం కృషి చేద్దామని పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో బ్రహ్మచారి, లోకేష్, నారాయ స్వామి, నంజుండాచారి, నాగరాజు, బాబావలి, సారుక్, సూరి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు