Tuesday, February 11, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిపరమేశ్వర రావు గారి ఆశయాలను కొనసాగిస్తాం

పరమేశ్వర రావు గారి ఆశయాలను కొనసాగిస్తాం

కామ్రేడ్ పరమేశ్వరరావు తృతీయ వర్ధంతి
విశాలాంధ్ర ధర్మవరం; ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ రథసారథి ఉపాధ్యాయ ఉద్యమ నిర్మాత కామ్రేడ్ నూతలపాటి పరమేశ్వర రావు తృతీయ వర్ధంతి సందర్భంగా సత్యసాయి జిల్లా ఆధ్వర్యంలో ధర్మవరం యన్ జీ ఓ హోంలో జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు అధ్యక్షతన ఏర్పాటు చేసిన సంస్మరణ సభ లో ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమం లో పాల్గొన్న రాష్ట్ర ఉపాధ్యక్షులు కోనంకి అశోక్ కుమార్ మాట్లాడుతూ ఏపీటీయఫ్ సంఘాన్ని రాష్ట్రంలో మొనగాడు సంస్థ గా నిలబెట్టడంలో విశేష కృషి చేశారని తెలిపారు. ఉపాధ్యాయ సంపాదకులు నరేష్ కుమార్ జిల్లా పూర్వ అధ్యక్షులు రాష్ట్ర కౌన్సిలర్ ముత్యాలప్ప మాట్లాడుతూ పరమేశ్వర రావు ఏపీటీయఫ్ ఉపాధ్యాయ రెండూ తన శ్వాస ధ్యాస గా జీవించాడని విలువలుతో కూడిన ఉద్యమాలను నిర్మించి కొనసాగించారని పేర్కొన్నారు. జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శ్రీనివాసులు చంద్ర మాట్లాడుతూ పరమేశ్వర రావు గారి ఆశయాలను కొనసాగిస్తామని తెలిపారు ఈ కార్యక్రమం లో జిల్లా ఉపాధ్యక్షులు బలరాముడు, రవీంద్ర రెడ్డి రాష్ట్ర కౌన్సిలర్ శ్రీనివాసులు పూర్వ జిల్లా కార్యదర్శి చంద్ర శేఖర్ గౌడ్ వివిధ మండలాల బాధ్యులు వాసు శంకర నారాయణ ఈశ్వరయ్య శివానంద రాఘవేంద్ర నరసింహులు జగదీష్ నాగేంద్ర బాలయ్య శేషు జయరాం సీనియర్ నాయకులు మరియు వంద మంది కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు