ఫిబ్రవరి 4న హంద్రీనీవా కార్యాలయం వద్ద ధర్నా…
సిపిఐ జిల్లా కార్యదర్శి జాఫర్
విశాలాంధ్ర -అనంతపురం : లైనింగ్ పనులు ఆపి ఆయకట్టుకు నీరు అందించాలని ఫిబ్రవరి 4వ తేదీన హంద్రీనీవా కార్యాలయం వద్ద సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి జగదీష్, ఇతర వామపక్ష పార్టీలు నాయకులతో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు సిపిఐ జిల్లా కార్యదర్శి సి. జాఫర్ పేర్కొన్నారు. సోమవారం సిపిఐ పార్టీ ప్రధాన కార్యాలయంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సి జాఫర్ మాట్లాడుతూ…. రాయలసీమ జిల్లాకు వరప్రసాదమైనటువంటి హంద్రీ నివా పథకాన్ని ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందన్నారు. గతంలో పామిడిలో జరిగిన సమావేశంలో చంద్రబాబు నాయుడు 6 వేలు క్యూసెక్కుల నీరు పెంచుతామని చెప్పడం జరిగిందన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పదివేల క్యూసెక్కుల నీటిని అందిస్తామన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత రాయలసీమ జిల్లాకు ఆరు లక్షల నాలుగు వేల ఎకరాలకు సాగునీరు, తాగునీరు ఇచ్చే పథకాన్ని తీసుకొని రావడం జరిగింది అన్నారు. ఉమ్మడి అనంతపూర్ జిల్లాలో 3 లక్షల 45 వేలు ఎకరాలకు సాగునీరు తాగునీరు ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ఈ విషయంపై ప్రభుత్వాలు సరైన పద్ధతిలో ప్రయత్నం చేయలేదని వారు పేర్కొన్నారు. రాయలసీమ జిల్లా కరువు ప్రాంతంతో కూడుకున్నదని వర్షాభావం సరిగా లేక ఇక్కడి రైతులు వేరే ప్రాంతాలకు వలస పోతున్నారన్నారు. రైతులు వరుసలుకోకుండా కాపాలంటే సమృద్ధిగా ఇవ్వాలన్నారు. 40 టీఎంసీ నీటిని స్వర్గీయ ఎన్టీ రామారావు నిర్మాణం చేశారన్నారు. శివరామకృష్ణ రూపకల్పన చేయడం జరిగిందన్నారు. ప్రస్తుతం 30 లక్షల మందికి తాగునీరు ఇవ్వడానికి, మూడు లక్షల 45 వేల ఎకరాలకు సాగునీరు ఇవ్వడంలో నత్త నడక నడుస్తోంది అన్నారు. కోనసీమ జిల్లాల్లో పట్టుసీమ ప్రాజెక్టు ఒక సంవత్సరంలో కట్టడం జరుగుతుందన్నారు. రాయలసీమ జిల్లాకు సంబంధించి తుంగభద్ర, హంద్రీనీవా ప్రాజెక్టులకు యుద్ధపాతిపదిక చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం లైనింగ్ పనులు చేపడుతున్నారని ద్వారా పదివేల క్యూసెక్కుల నీరు కాలువ వెడల్పు చేయకుండా ఏ విధంగా అందిస్తారని పేర్కొన్నారు. మల్యాల నుంచి 12 పంప్ సెట్లకు కాను పంప్ సెట్లు పనిచేస్తోందన్నారు. వెంటనే లైనింగ్ పనులు ఆపి అయ కట్టు ద్వారా క్షణమే పిల్ల కాలవలు త్రవ్వి నీరు అందించాలని డిమాండ్ చేశారు. గత వైసిపి ప్రభుత్వం హయాంలో పేదలకు గ్రామాల్లో ఒకటిన్నర సెంట్లు, గాను మూడు సెంట్లుగా, పట్టణాల్లో 1 సెంటు రెండు సెంట్లుగా చొప్పున ఇళ్లస్థలాల పట్టాలు ఇవ్వాలన్నారు. ఇంటి నిర్మాణం కోసం నాలుగు లక్షల నుంచి పెరిగిన ధరల దృష్టిలో పెట్టుకుని ఐదు లక్షలకు పెంచాలన్నారు. 10 సంవత్సరాల కాలం పాటు నివాసముంటున్న ఇండ్లకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన హామీలో భాగంగా పేద ప్రజలకు ఇంటి పట్టాలు ఇవ్వాలని దరఖాస్తులు పూర్తి చేసి కలెక్టరేట్ కార్యాలయంలో ఇవ్వడం జరిగిందన్నారు. జనవరి 27 నుంచి ఫిబ్రవరి 10వ తేదీ వరకు ఇంటి పట్టాలు దరఖాస్తులు పూర్తి చేసి పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అదానీతో చేసుకున్న ఒప్పందాలన్నీ రద్దుచేయాలిని పెంచిన విద్యుత్ సర్దుబాటు చార్జీల భారాలను ప్రభుత్వమే భరించాలన్నారు.
గత జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ హయాంలో అదానీ కంపెనీలతో రాష్ట్రంలో జరిగిన విద్యుత్ ఒప్పందాల్లో గౌతమ్ అదానీ, సాగర్ అదానీలు పెద్ద ఎత్తున లంచాలు ముట్టజెప్పి, ప్రత్యేకించి విద్యుత్ ఒప్పందాల్లో సెకీ ద్వారా లబ్దిపొందారని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో రూ.1750 కోట్లు లంచాలుగా ముట్టజెప్పడం ద్వారా లబ్దిపొందినట్లు చెబుతున ఎపి ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమీషన్ వారు మోపిన 2022-23 ఆర్థిక సంవత్సరానికి చెందిన విద్యుత్ సర్దుబాటు చార్జీలు రూ.6072 కోట్ల విద్యుత్ భారం 2024 డిసెంబర్ నెల నుండి వినియోగదారులు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. తెలుగుదేశం పార్టీ గతంలో ప్రతిపక్షంలో ఉండగా వామసక్షాలతోపాటు స్మార్ట్ మీటర్లను తీవ్రంగా వ్యతిరేకించింది. కాని అధికారం చేపట్టాక మళ్లీ స్మార్టీమీటర్లు బిగించడానికి ప్రయత్నిస్తూ మరో రూ.7 వేల కోట్ల భారాన్ని ప్రజలపై మోపేందుకు సిద్ధమయ్యారు అన్నారు. గత ఎన్నికల సందర్భంగా చంద్రబాబు నాయుడు “మేము అధికారంలోకొస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యుత్ చార్జీలను పెంచబోమని, వీలైతే తగ్గించేందుకు ప్రయత్నిస్తామని’ చెప్పారు. కాని ఇప్పుడు దాదాపు రూ.15,484 కోట్ల విద్యుత్ భారాలను రాష్ట్ర ప్రజలపై మోపేందుకు సిద్ధమవ్వడం విచారకరమన్నారు. పార్లమెంటులో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ “పదేపదే అంబేద్కర్ అని ఎందుకంటారు పని ఎద్దేవా చేస్తూ అంబేద్కర్ బదులు
ఏ హిందూ దేవుడినైనా తలచుకుంటే స్వర్గానికి వెళ్తారు” అని వ్యాఖ్యానించడం దుర్మార్గం. అమితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను కించపరుస్తూ మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండిస్తూ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జిల్లా సహాయ కార్యదర్శులు పి నారాయణస్వామి, సి మల్లికార్జున, వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి కేశవరెడ్డి, నగర కార్యదర్శి ఎన్ శ్రీరాములు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి గోపాల్, సంజీవప్ప, టి నారాయణస్వామి, తదితరులు పాల్గొన్నారు.