విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని ఆర్టీసీ బస్టాండులో అనువైన దుకాణముల కొరకు టెండర్లను నిర్వహించడం జరుగుతుందని డిపో మేనేజర్ సత్యనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వెజ్, నాన్ వెజ్ హోటల్ కు, ఫ్లెక్సీ ప్రింటర్స్ కు, కూల్ డ్రింక్ అండ్ బేకరీకు, మొబైల్ రిపేర్, కంప్యూటర్ రిపేర్, పైప్స్ గోడౌన్, ఎగ్జిబిజినెస్ సేల్స్, జిమ్ రెస్ట్ రూమ్ అండ్ స్టొరుములకు గదులు అద్దెకు కలవని తెలిపారు. ఈనెల 21వ తేదీ నుండి ఫిబ్రవరి 5వ తేదీ వరకు ఉదయం 10:30 గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు డిపో మేనేజర్ కార్యాలయంలో టెండర్ ఫారం విక్రయించడం జరుగుతుందని తెలిపారు. టెండర్ ఫారం ధర 885 రూపాయలు ఉంటుందని తెలిపారు. పూరించిన టెండర్ ఫారములు ఫిబ్రవరి 6వ తేదీ జిల్లా ప్రజా రవాణా అధికారి కార్యాలయం పుట్టపర్తి నందు ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం రెండు గంటల లోపు టెండర్ బాక్స్ నందు వేయవలెనని తెలిపారు. తదుపరి ఇదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు టెండర్ బాక్స్ తెరవబడునని తెలిపారు. ఆసక్తి గల వ్యాపారస్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, తమ వ్యాపారం అభివృద్ధి చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునే అవకాశం కలదని తెలిపారు.
ఆర్టీసీలో దుకాణములకు టెండర్.. డిపో మేనేజర్ సత్యనారాయణ
RELATED ARTICLES