వైసిపి నుండి బిజెపిలోకి పలువురు చేరిక
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణం లోని
10వ వార్డు కు చెందిన వైసిపీ నాయకులు కృష్ణాపురం జమీర్ అహ్మద్, తనయుడు శాహిన్షా,వారి అనుచరులు కలసి బిజెపి పార్టీ సత్య సాయి జిల్లా అధ్యక్షులు జి యమ్ శేఖర్,హరీష్ బాబు ,ఆధ్వర్యంలో బిజెపి లోకి పలువురు చేరారు.వారికి బిజెపి నాయకులు పార్టీ కండువా వేసి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం హరీష్ బాబు, సత్య సాయి జిల్లా బిజెపి ఇంచార్జ్ జి యమ్ శేఖర్ మాట్లాడుతూ, ధర్మవరం శాసనసభ్య నియోజకవర్గంలో కూడా భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉన్నది అని, అందులో భాగంగానే వైయస్సార్ పార్టీలో కీలక నేతగా ఉన్నటువంటి కృష్ణాపురం జమీర్ అహమ్మద్ ను భారతీయ జనతా పార్టీలోకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం అని తెలిపారు. అరచేతితో సూర్యుని ఆపగలమా? మరి చేరికలను ఆపగలరా? భారతీయ జనతా పార్టీ శాసనసభ్య నియోజకవర్గంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులను నిజాయితీగా ఉన్నటువంటి వ్యక్తులను ధర్మవరం నియోజకవర్గం అభివృద్ధి చెందాలని కోరుకునే ప్రతి వ్యక్తి నీ, ప్రతి నాయకుడిని భారతీయ జనతా పార్టీలోకి చేర్చుకుని తీరుతామని అని అన్నారు అదేవిధంగా గత ప్రభుత్వంలో ఏ నాయకుడైనా ప్రజలను ఇబ్బంది పెట్టి ఉంటే అరాచకం చేసి ఉంటే, అటువంటివారిని తాటతీస్తామని హెచ్చరించారు.