విశాలాంధ్ర – కడియం : విఘ్నాలను తొలగించి, సకల శుభాలను ప్రసాదించే వినాయక చవితి వేడుకలు కడియం మండలం కడియపులంక గ్రామంలో సోమవారం వినూత్నంగా ప్రారంభమయ్యాయి. సుమారు 1250 కిలోల మట్టితో తయారుచేసిన వినాయకుడిని, నేపాల్ నుండి తీసుకువచ్చిన 25 వేల రుద్రాక్షలతో అలంకరించడం ఇక్కడి చవితి ఉత్సవాలకు ప్రత్యేకతను తీసుకొచ్చింది. స్థానిక ఆరేటి భద్రరావు వీధిలో ఏర్పాటు చేసిన ఈ విగ్రహం భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది. కాలుష్య రహితంగా ఉత్సవాలను జరిపించడానికి నిర్వాహకులు చేస్తున్న కృషిని పలువురు అభినందిస్తున్నారు. గణపతి ఉత్సవాల అనంతరం ఈ రుద్రాక్షలను భక్తులకు ప్రసాదంగా పంపిణీ చేయనున్నారు. ఇక్కడ గత సంవత్సరం చిల్లర నాణేలతో వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసినదే.
భక్తులను ఆకర్షిస్తున్న రుద్రాక్షల వినాయకుడు
- Advertisement -
RELATED ARTICLES


