సీఎం చంద్రబాబు నాయుడు తిరుమల పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో చేపట్టిన పలు కీలక అభివృద్ధి కార్యక్రమాలను నేడు ప్రారంభించనున్నారు. భక్తుల భద్రత, సౌకర్యాలే లక్ష్యంగా ఈ ప్రాజెక్టులను అందుబాటులోకి తెనున్నారు.ఇందులో భాగంగా శ్రీవారి విశేషాలు, తిరుమల విశిష్టతను భక్తులకు తెలియజేసేందుకు ఏర్పాటు చేసిన శ్రీ వేంకటేశ్వర మ్యూజియంను సీఎం ప్రారంభించనున్నారు. సుమారు లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో, 4 అంతస్తులతో నిర్మించిన ఈ మ్యూజియంలో 14 గ్యాలరీలు, 8,000కు పైగా ప్రదర్శనలు ఉన్నాయి. దీంతో పాటు తిరుమలకు వచ్చే ప్రతి భక్తుడి భద్రతకు ప్రాధాన్యతనిస్తూ ఎల్ఐసీతో కలిసి టీటీడీ తీసుకొచ్చిన గ్రూప్ ఇన్సూరెన్స్ పథకాన్ని కూడా ఆయన ప్రారంభించనున్నారు. దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉండే భక్తుల కోసం ఃతిరుమల హీలింగ్ అండ్ డివోషన్ ఎక్స్‌పీరియన్స్ః కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్-1లో ఇమ్మెర్సివ్ థియేటర్‌తో పాటు లైవ్ మెడిటేషన్ కార్యక్రమాలను ఇందులో ప్రసారం చేయనున్నారు. యాత్రికుల వసతి గదుల కోసం రూపొందించిన ఃనందకం యాప్ఃను కూడా ముఖ్యమంత్రి లాంచ్ చేయనున్నారు.
పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ తిరుమల ఘాట్ రోడ్లలో నడిపేందుకు 32 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి రానున్నాయి. రిలయన్స్ సంస్థ 25 బస్సులు, భారత్ బయోటెక్ 7 బస్సులను టీటీడీకి విరాళంగా అందించాయి. ఈ బస్సులను సీఎం జెండా ఊపి ప్రారంభించనున్నారు.


