Homeజిల్లాలుశ్రీ సత్యసాయిమద్యం దుకాణాల రెన్యువల్ లో గెజిట్ విడుదల.. డిప్యూటీ కమిషనర్ వరప్రసాద్

మద్యం దుకాణాల రెన్యువల్ లో గెజిట్ విడుదల.. డిప్యూటీ కమిషనర్ వరప్రసాద్

- Advertisement -

విశాలాంధ్ర ధర్మవరం;; 18 ఓపెన్ క్యాటగిరి, రెండు రిజర్వ్డ్ కేటగిరీల కు చెందిన ధర్మవరము, ముదిగుబ్బ, తాడిమర్రి, బత్తలపల్లి మద్యం దుకాణాలు రెన్యువల్ నిమిత్తము గెజిట్ విడుదల చేయడం జరిగింది అని డెప్యూటీ కమీషనర్ అనంతపురం -వరప్రసాద్ , ధర్మవరం ఎక్సైజ్ సీఐ ఎన్. చంద్రమణి తెలిపారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ కార్యాలయంలో మద్యం లైసెన్సు దారులకు సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఓపెన్ క్యాటగిరి, రిజర్వేషన్ కేటగిరి కింద మద్యం షాప్ లకు 2026 – 27 సంవత్సరానికి లైసెన్స్ ఫీజును 4 వాయిదాలలో చెల్లించే అవకాశం ఉంటుంది అని తెలిపారు. పర్మిట్ రూమ్ మొత్తంను 3 వాయిదాలలో చెల్లించవచ్చు అని తెలిపారు. . సెప్టెంబర్ నెల 21వ తారీకు సాయంత్రం 05 గంటల లోపల మద్యం దుకాణాల రెన్యూవల్ సరిపడా రుసుమును ప్రభుత్వం వారికి చెల్లించాల్సిందిగా సూచనలు ఇవ్వడం జరిగినది అని తెలిపారు.కాగా రెన్యువల్ కు ముందుకు రాని మద్యం దుకాణాలకు, సకాలంలో ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఫీజు చెల్లించని వాటికి వారి మద్యం లైసెన్సులు రద్దు చేసి, వాటి స్థానంలో సెప్టెంబర్ నెల 22వ తారీకు నుండి నూతన మద్యం షాపుల టెండర్లకు ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. ఈ సమావేశంలో ఎక్సైజ్ ఎస్సైలు చాంద్ బాషా, నాగరాజు, హెడ్ కానిస్టేబుల్లు, కానిస్టేబుల్లు ,
మద్యం దుకాణాల వారు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు