విశాలాంధ్ర ధర్మవరం;;ధర్మవరం పట్టణంలో శ్రీ బీరప్ప స్వాముల మహా ఊరేగింపునకు రంగం సెప్టెంబర్ నెల 21న సాయంత్రం బీరప్ప స్వాముల ఊరేగింపును అంగరంగ వైభవంగా నిర్వహించాలని గుడికట్ల పిన్నపెద్దలు, పూజారులు, కాపులు తదితరులు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు పట్టణ ప్రముఖులు గోసే రాధాకృష్ణ ప్రత్యేక చొరవ తీసుకుని ఏర్పాట్లను సమన్వయం చేస్తున్నారు.ఈ నేపథ్యంలో పట్టణంలోని గిర్రాజు కాలనీ సమీపంలో నిర్వహించిన సమావేశంలో గుడికట్ల పిన్నపెద్దలు, పూజారులు, కాపులు, ప్రముఖులు పాల్గొని వివరాలను తెలియజేశారు. ఈ సందర్భంగా గోసే రాధాకృష్ణ పూజారులతో కలిసి ఊరేగింపు కరపత్రాలను విడుదల చేశారు. గోసే రాధాకృష్ణ మాట్లాడుతూ బీరప్ప స్వాముల వైభవాన్ని చాటిచెప్పేలా ఈ ఊరేగింపును భక్తిశ్రద్ధలతో, ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. సెప్టెంబర్21న సాయంత్రం గాంధీనగర్‌లోని చౌడమ్మ దేవాలయం నుంచి ఊరేగింపు ప్రారంభమై పీఆర్డీ సర్కిల్, కళాజ్యోతి సర్కిల్, కాలేజీ సర్కిల్ మీదుగా పోతుకుంట రోడ్డులోని పెట్రోల్ బంకు వరకు కొనసాగుతుందని తెలిపారు.ఈ మహా ఊరేగింపులో ముష్టూరు కాటమయ్య స్వామి, గంగలకుంట సంగమేశ్వర సంగాలప్ప స్వామి, మరూరు పల్లెల్లప్ప స్వామి, గొట్లూరు తలమర్లప్ప స్వామి, ధర్మవరం ధర్మవరమప్ప స్వామి, ధర్మపురి కుర్లపల్లయ్య స్వామి, మాల్యవంతం మాలకుంటప్ప స్వామి తదితర బీరప్ప స్వాములు పాల్గొంటారని తెలిపారు.గుడికట్ల పిన్నపెద్దలు, పూజారులు, కాపులు, భక్తులు, పట్టణ ప్రజల సమిష్టి భాగస్వామ్యంతో కార్యక్రమాన్ని విజయవంతం చేయనున్నట్లు తెలిపారు. పట్టణ ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.
ధర్మవరంలో సెప్టెంబర్ 21న బీరప్ప స్వాముల మహా ఊరేగింపు
- Advertisement -
RELATED ARTICLES


